YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ రాజధాని మార్పు కేసులో సుప్రీంకోర్ట్ లో అనూహ్య పరిణామం

ఏపీ రాజధాని మార్పు కేసులో సుప్రీంకోర్ట్ లో అనూహ్య పరిణామం

న్యూఢిల్లీ  ఆగష్టు 19  
ఏపీ రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయటం.. దానికి గవర్నర్ ఆమోదముద్ర వేయటం తెలిసిందే. అయితే.. రాజధాని కోసం వేలాది ఎకరాలు ఇచ్చిన అమరావతి రైతులు.. జగన్ సర్కారు తీరును తప్పు పడుతూ.. రాజధాని మార్పు అంశంపై కోర్టును ఆశ్రయించటం తెలిసిందే.ఏపీ సర్కారుకు తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలు మింగుడుపడని ప్రభుత్వం.. ఈ విషయాన్ని సుప్రీం ముందుకు తీసుకెళ్లింది. పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర సర్కారు మూడు రాజధానుల నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానానికి వివరించింది. అదే సమయంలో సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలని కోరింది.తాజాగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో సుప్రీంలో షురూ కాగా.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన రాజధాని పరిరక్షణ సమితి పిటిషన్ తరఫున వాదించటానికి ప్రముఖ సీనియర్ న్యాయవాది పాలి నారిమాన్ హాజరయ్యారు. దీంతో.. ధర్మాసనంలో సభ్యుడైన నారీమన్ కుమారుడు రోహింటం నారిమన్ తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.న్యాయమూర్తి తండ్రిని అమరావతి రైతులు న్యాయవాదిగా నియమించుకోవటంతో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దీంతో.. నాట్ బిఫోర్ మీ అన్న న్యాయమూర్తి నారిమన్.. కేసు విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ వేరే ధర్మాసనం ముందుకు కానీ.. న్యాయమూర్తి ముందుకు కాని వెళ్లనుందని చెబుతున్నారు.

Related Posts