విశాఖపట్నం ఆగష్టు 19
వైసీపీ నాయకులు విశాఖ పై కపట ప్రేమ నటిస్తున్నా రని టిడిపి నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మీ ప్రేమ ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు ఇక్కడి భూమిపై మాత్రమేనని ఆయన అన్నారు. విజయనగ రానికి తలమానికమైన మాన్సాస్ ట్రస్ట్ ని చెరబట్టారన్న ఆయన 50 వేల కోట్ల ఆస్తులు కలిగిన ట్రస్ట్ పై విజయసాయి కన్నుపడిందని అందుకే విశాఖలో కబ్జాలు, భూదందాల పర్వం మొదల య్యిందని అన్నారు. విశాఖని విజయసాయి రియల్ ఎస్టేట్ దందాకు అడ్డగా మార్చుకున్నారన్న ఆయన పట్టుబడిన వాళ్ళు నా వాళ్ళు కాదంటూ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ చూస్తే నవ్వొస్తుందని అన్నారు.