YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మంచిర్యాలలో ఎటీఎం వ్యాపారం

మంచిర్యాలలో ఎటీఎం వ్యాపారం

జిల్లాలో ఉన్న ఎటిఎం కేంద్రాలు నగదు లేక ఎప్పుడు మూసి ఉండటంతో అలంకారప్రాయంగా మారాయి. దీనితో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లాలోని సింగరేణి ప్రాంతాలైన మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ ప్రాంతాల్లో బ్యాంకుల్లో నగదు కొరత కారణంగా నగదు బదిలీ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఎటిఎం కేంద్రాల్లో పూర్తి స్థాయిలో నగదు లేకపోవడం బ్యాంకులకు వెళ్ళినా ఖాతాదారులకు సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు వారిని నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు.మంచిర్యాలలో 44 బ్యాంకులు, 78 ఎటిఎం కేంద్రాలు ఉండగా ౩5 ఎటిఎంలు పూర్తి స్థాయిలో పని చేయడం లేదు. అదే విధంగా బెల్లంపల్లి పట్టణంలో 17 బ్యాంకులకు గాను 10 ఎటిఎం కేంద్రాలు ఉండగా 6 కేంద్రాల్లో డబ్బులు లభించడం లేదు. చెన్నూరులో 25 బ్యాంకులు ఉండగా 19 ఎటిఎంలు ఉన్నాయి. ఇందులో 14 ఎటిఎంలలో పూర్తి స్థాయిలో డబ్బులు లభించక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్యాంకుల్లో నగదు కొరతతో జిల్లాలో నగదు బదిలీ వ్యాపారం జోరందుకుంది. కార్మికులకు డబ్బు అవసరం పడితే ఎటిఎం కేంద్రాలకు వెళుతున్నారు. అందులో డబ్బులు లేకుంటే నేరుగా ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఖాతాదారుడి ఎటిఎం కార్డు ద్వారా సదరు వ్యాపారి ఖాతాలోకి రూ.21వేలు తీసుకొని కార్మికులకు, ప్రజలకు రూ.20వేలు మాత్రమే అందజేస్తున్నారు. రూ.10వేలకు రూ.500 కమీషన్ పొందుతుండగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. కమీషన్ విషయంలో ప్రశ్నిస్తే సదరు వ్యాపారులు డబ్బులు ఇవ్వలేమని చేతులెత్తేస్తున్నారు. దీనితో అత్యవసర పరిస్థితుల్లో గత్యంతరం లేక ప్రజలు కమీషన్ చెల్లిస్తూ డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలలో పని చేస్తూ మందమర్రిలో ఉంటున్న సింగరేణి కార్మికులు సుమారు 25 మంది ఉంటారు. వీరికి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు అదనంగా జాతీయ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఒక్కో కార్మికుడు, ఉద్యోగికి ప్రతినెల సుమారు రూ.15వేల నుంచి రూ.1లక్షకు పైగా వేతనం వస్తుంది.సింగరేణి యాజమాన్యం ప్రతినెల 1 నుంచి 5 తేదీల మధ్య వారి ఖాతాలలో జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బ్యాంకుల్లో లావాదేవీలు అధికంగా ఉంటాయి. సాధారణ సమయాల్లో ఒక్కో బ్యాంకులో రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు చెల్లింపులు జరుపుతున్నారు. ఇదే వేతనాల సమయంలో రూ.80లక్షల నుంచి రూ.1 కోటి వరకు చెల్లింపులు ఉంటాయి. అయితే నగదు లేమి వల్ల బ్యాంకు అధికారులు కార్మికులకు సరిపడా నగదు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. 

Related Posts