YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తప్పుడు బిల్లులతో కోట్లు కొల్లగొట్టారు ఈఎస్ఐ స్కాంను విచారిస్తున్న ఏపీ అవినీతి నిరోధక శాఖ వెల్లడి

తప్పుడు బిల్లులతో కోట్లు కొల్లగొట్టారు ఈఎస్ఐ స్కాంను విచారిస్తున్న ఏపీ అవినీతి నిరోధక శాఖ వెల్లడి

అమరావతి ఆగస్టు 19 
ఈఎస్ఐ స్కాంను విచారిస్తున్న ఏపీ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఈ కేసులో తప్పుడు బిల్లులతో కోట్లు కొల్లగొట్టారని తేల్చింది.తాజాగా బుధవారం ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు.  ఈ కేసులో ఇప్పటికే 12మందిని అరెస్ట్ చేశామని.. మరో 9మందికి సంబంధించి ఈ కేసులో ఆధారాలు సేకరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈఎస్ఐ స్కాంలో త్వరలోనే చార్జీషీట్ దాఖలు చేస్తామని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. అమరావతి మెడికల్స్ తిరుమల మెడికల్స్ కంపెనీలు 2019 తర్వాత మూసివేశారని తేలిందన్నారు.హెల్త్ టెలీ సర్వీసెస్ స్కీమ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఓ కంపెనీకి అనుకూలంగా ఆర్డర్ ఇచ్చారని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. తప్పుడు బిల్లులు పెట్టి క్లెయిమ్ చేశారనా్నరు. రూ.233 కోట్లు కోట్ చేసి రూ.650కోట్లు తప్పుడు లెక్కలు చూపించారని ఈఎస్ఐ స్కాంపై తమ దర్యాప్తులో తేలిందని ఆయన చెప్పారు.మందుల కొనుగోళ్లలో 106 కోట్లు విలువ చేసే మందులు కాంట్రాక్టు లేకుండా కొనుగోలు చేశారన్నారు. టెండర్ తోనే కొనుగోలు చేయాలన్న నిబంధనను తుంగలో తొక్కారని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు.అన్ని రకాల నిబంధనలు తుంగలో తొక్కి ధనలక్ష్మి అనే ఉద్యోగిని ద్వారా అప్పటికపుడు బోగస్ కంపెనీ పుట్టించి మందులు సప్లై చేశారని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. జాయింట్ డైరెక్టర్ జనార్దన్ కడపలో 400 కోట్లు విలువైన మందులు అవసరంలేనివి కొనుగోళ్లు చేశారన్నారు. లోపాయకారి వ్యవహారాలు చాలా జరిగాయని.. అచ్చెంనాయుడు గారి సంతకాలు చేసినట్లు గుర్తించామని తెలిపారు.   200 రూపాయలు అయ్యే ఈసీజీకి 480 రూపాయల ఛార్జ్ చేశారన్నారు. అన్ని రకాల అధికార దుర్వినియోగం జరిగిందని విచారణలో తేలిందన్నారు.ఈ టెండర్లు లేకుండానే కొనుగోళ్లు మరియు బిల్లులు కూడా అన్నీ ఒరిజినల్స్ కావని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. 12 మంది ముద్దాయిలు అరెస్ట్ చేసామని.. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఇంకా చాలా మందిని విచారించాల్సి ఉందని వివరించారు.ఏపీలో వందల కోట్ల ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయనతోపాటు అధికారులు  టీడీపీ నేతల ప్రమేయంపై ఏసీబీ ఆరాతీస్తోంది.  
=

Related Posts