YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ కరోనాని కూడా కక్ష్యసాధింపు చర్యలకు ఆయుధంగా వాడుకుంటున్నారు - కళా వెంకట్రావు

జగన్ కరోనాని కూడా కక్ష్యసాధింపు చర్యలకు ఆయుధంగా వాడుకుంటున్నారు -  కళా వెంకట్రావు

అమరావతి ఆగష్టు 19  
వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షనాయకులపై కక్ష్యసాధింపులు, వేధింపులకు పాల్పడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోంది. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అనారోగ్యం పాలు చేసి శారీరకరంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని టీడీపీ నేత కళా వెంకట్రావు ఆరోపించారు.  అక్రమ కేసులో అరెస్ట్ అయి జైళ్లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష్యపూరిత వైఖరే కారణం. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిని చేయని తప్పుకు తప్పుడు కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపారు. రెండవసారి అరెస్ట్ చేయటం వల్లే ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం కరోనాని కూడా కక్ష్యసాధింపు చర్యలకు ఆయుధంగా వాడుకుంటోంది. వైసీపీ ప్రభుత్వం ఆఫరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు అక్రమ కేసులతో జైలుకు పంపి కరోనా రావడానికి కారణం అయ్యింది. అత్యంత భద్రత మద్య ఉన్న ప్రభాకర్ రెడ్డికి, అచ్చెన్నాయుడికి కరోనా ఎలా వచ్చింది? అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అయన అన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష్యసాధించటంపై దృష్టి పెట్టారు. 16 నెలల వైసీపీ పాలనలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాల కంటే ప్రతిపక్షనేతలపై పెట్టిన కేసులే వందరెట్లు అధికంగా ఉన్నాయి. బుద్దుని శాంతి స్వరూపానికి చిహ్నమైన అమరావతిలో కూర్చుని జగన్ ప్రతిపక్ష నేతలని హింసించటం, వేధించటం బాధాకరం. జగన్ పాలనలో ప్రతిపక్షనేతలపై జరుగుతున్న దాడులు, వేదింపులు, కక్ష్యసాధింపులు ఆదిమానవుని కాలంలో కూడా జరిగివుండవు. 16 నెలలకే జగన్ పాలనని సభ్య సమాజం అసహ్యించుకుంటోంది. జగన్ లో ప్యాక్షన్ పద్దతి మారింది తప్ప, తన ప్యాక్ష్యన్ మనస్తత్వం మాత్రం మారలేదు. గతంలో భౌతికంగా దాడులు చేసి హింసించేవారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులని తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ లతో మానసికంగా హింసిస్తున్నారు. అక్రమ కేసులతో కోడెల శివప్రసాదరావుని బలితీసుకున్నారు. మీ కక్షసాధింపు చర్యలకు ఇంకెంతమంది బలికావాలి? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న విషయం జగన్మోహరెడ్డి గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ ప్రభుత్వం ఓ వైపు కరోనా, మరోవైపు ఫ్యోన్ ట్యాపింగ్ లతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం, జీవించే హక్కును కాలరాస్తోంది. కరోనాని, ప్యోన్ ట్యాపింగ్ ని కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుందని అయన అన్నారు.

Related Posts