YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన ఏపీ మంత్రిమండలి భేటీ పలు పథకాలకు అమోదం

ముగిసిన ఏపీ మంత్రిమండలి భేటీ పలు పథకాలకు అమోదం

అమరావతి ఆగష్టు 19  
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో నూతన పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే. నవరత్నాల్లో మరో కీలక పథకానికి, వైయస్సార్ ఆసరాకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏఫ్రిల్ 11, 2019 నాటికి బ్యాంకులకు బకాయిపడ్డ డ్వాక్రా అక్కచెల్లమ్మల రుణాలను నాలుగు వాయిదాలుగా ప్రభుత్వం చెల్లించనుంది. నాలుగేళ్లలో రూ. 27,169 కోట్లు అక్కచెల్లమ్మల చేతికివ్వనుంది. సెప్టెంబరు 5 న జగనన్న విద్యా కానుక ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దాదాపు 43 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. వాహనాలు కొనుగోలు కోసం రుణాలు తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనుంది. సార్టెక్స్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదార్ల ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ వాహనాలు వినియోగిస్తారు. 60శాతం సబ్సిడీ మీద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మరియు ఈబీసీ యువకులకు స్వయం ఉపాధి కింద ఈ వాహనాలను అందిస్తారు.చిత్తూరు జిల్లా వెదురుకుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 26 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం లభించింది. వై.ఎస్.ఆర్ జిల్లా వేంపల్లె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 27 టీచింగ్ పోస్టులు, 8 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. విశాఖ జిల్లా దిగువ సీలేరు జల విద్యుత్ కేంద్రంలో అదనంగా 2 యూనిట్లు, 115 మెగావాట్లు చొప్పున 2 యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వై.ఎస్.ఆర్ జిల్లా రాయచోటిలో కొత్త పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పులివెందుల సబ్డివిజన్ నుంచి రాయచోటి శివారు గ్రామాలు 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు రాయచోటి జనాభా పెరిగిన నేపధ్యంలో ఈ కొత్త సబ్డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించింది. నూతన పారిశ్రామిక విధానం 2020–23 కేబినెట్ ఆమోదం ఇచ్చింది. అలాగే, తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. వై.ఎస్.ఆర్ జిల్లా కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకుమంత్రి మండలి సూత్రప్రాయంగా అంగీకరించింది. భావనపాడు పోర్టు కోసం రైట్స్ కంపెనీ డీపీఆర్కు కేబినెట్ ఆమోదం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్( క్వాలిటీ కంట్రోల్ ) యాక్టు– 2006 సవరణలపై ఆర్డినెన్స్కు కేబినెట్ ఆమోదం లభించింది.

Related Posts