YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స

పాత్రికేయుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స

విజయనగరం ,  ఆగష్టు 19  
పాత్రికేయుల సమస్యలపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారు .  ప్రింట్ మీడియా ,  ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పాత్రికేయులు ,  వీడియో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి తెలుసని ఆయన పేర్కొన్నారు .  ఆ  యా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని మంత్రి బొత్స తెలిపారు .  ఏపి యుడబ్ల్యూజె రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు టి. రాధాకృష్ణ  , యూనియన్ జిల్లా పూర్వాధ్యక్షుడు  వి. మహాపాత్రో తో పాటు యూనియన్ సభ్యులు బంకురు శంకర రావు తదితరులు బుధవారం మంత్రి బొత్సను ఆయన నివాసంలో కలిశారు . ప్రస్తుత కరోనా నేపథ్యంలో మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు తెలియచేశారు . మీడియాను ఫ్రంట్ లైన్ కోవిడ్ వారియర్లుగా గుర్తించాలని కోరారు . కరోనా కారణంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు . అలాగే కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కోరారు . కరోనా సోకిన జర్నలిస్టులకు ఆస్పత్రులలో ప్రత్యేక పడకలు కేటాయించి మెరుగైన వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు . అలాగే  జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చెయ్యాలని కోరారు . జర్నలిస్టులపై దాడుల నియంత్రణకు అటాక్స్ కమిటీ లను ఏర్పాటు చెయ్యడంతో పాటు ప్రెస్ అకాడమికి సభ్యులను నియమించాలని , అక్రిడిటేషన్ కమిటీలను ప్రకటించాలని యూనియన్ ప్రతినిధులు మంత్రి బొత్సను కోరారు . ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం ఆ అందచేశారు.వీటిపై మంత్రి బొత్స సానుకూలంగా స్పందించారు . జర్నలిస్టులకు ఇళ్ళ  మంజూరు  ,  ప్రెస్ అకాడమి సభ్యుల నియామకం , అక్రిడిటేషన్ కమిటీల నియామక ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిందని , త్వరలోనే పూర్తి చేస్తుందని పేర్కొన్నారు .

Related Posts