YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

రాజధాని అంశం మా పరిధిలోనిది కాదు’.. హైకోర్టుకు మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

రాజధాని అంశం మా పరిధిలోనిది కాదు’.. హైకోర్టుకు మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

అమరావతి ఆగస్టు 19 
పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో హైకోర్టు జారీ చేసిన నోటీసులపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో కేంద్రం మరోసారి కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్‌డీఏ చట్టం రద్దు నిర్ణయాల అంశంలో దోనె సాంబశివరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున హోంశాఖ అండర్‌ సెక్రటరీ లలిత అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2014 ఏప్రిల్‌ 23న అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొందని.. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం రాజధాని అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసిందని అందులో తెలిపారు. రాజధాని నిర్ణయించుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పాత్రలేదని.. తమ రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్ర ప్రాంతాల అభివృద్ధి 2020 చట్టం రూపకల్పన విషయాన్ని రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకురాలేదని అఫిడవిట్‌లో పేర్కొంది. చట్టాలు చేసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేసింది. ఈనెల 14న పేర్కొన్న అంశాలనే తాజాగా కేంద్రం పునరుద్ఘాటించింది.

Related Posts