YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితా మూడేండ్ల వరకు చెల్లుబాటు: జితేంద్ర సింగ్

ఉమ్మడి ప్రవేశ పరీక్ష మెరిట్ జాబితా మూడేండ్ల వరకు చెల్లుబాటు: జితేంద్ర సింగ్

న్యూ ఢిల్లీ ఆగష్టు 19 
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఈటీ) మెరిట్ జాబితా మూడేండ్ల వరకు చెల్లుబాటులో ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఆ గడువు వరకు అభ్యర్థుల సామర్థ్యం, ప్రతిభ మేరకు పలు ప్రభుత్వ రంగాల్లోని ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను జాతీయ నియామక సంస్థ నిర్వహిస్తుందని వివరించారు. దేశ చరిత్రలో చేపట్టిన సంస్కరణల్లో మైలురాయి వంటిదని ఆయన చెప్పారు. నియామకం, ఎంపిక, ఉద్యోగాల ఖరారు వంటివి ఇకపై చాలా సులువుగా జరుగుతాయని తద్వారా సమాజంలో లబ్ధిపొందలేని కొన్ని వర్గాలకు జీవన సౌలభ్యం లభిస్తుందని జితేంద్ర సింగ్ వివరించారు.మరోవైపు దేశంలో సుమారు 20కిపైగా నియామక సంస్థలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సీ చంద్రమౌలి తెలిపారు. ఇందులో మూడు సంస్థలు మాత్రమే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. జాతీయ నియామక సంస్థ ఏర్పాటుతో దేశంలోని 20పైగా ఉన్న నియామక సంస్థలన్నీ ఒక గొడుగు కిందకు వస్తాయని అన్నారు. దీంతో రానున్న కాలంలో ఈ సంస్థలన్నీంటికి కలిపి ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరుగుతుందని చంద్రమౌలి వివరించారు.

Related Posts