YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ రూమ్*

*విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు*
కోవిడ్-19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఏపీ వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈమేరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్-19 ఇన్ స్టెంట్ ఆర్డర్-75ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
* విమానం ఎక్కేందుకు కనీసం 72 గంటల ముందు తప్పనిసరిగా  www.spandana.ap.gov.in ఆన్ లైన్ పోర్టల్‌లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అసరమైతే ప్రయాణీకులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్ లో ఉండేందుకు అంగీకరిస్తూ సెల్ఫ్‌-డిక్లరేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. (పెయిడ్ క్వారంటైన్ కోరుకునేవారు ఖర్చులను భరించాలాల్సి ఉంటుంది).
* తీవ్రమైన జబ్బులు ఉన్న వారికి, గర్భిణులకు, పదేళ్లలోపు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మరణిస్తే వారిని చూడడానికి వెళ్తున్న ప్రయాణికులందరూ క్వారంటైన్‌కు బదులుగా 14 రోజుల హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
* అంతే కాకుండా ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌ (ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే క్వారంటైన్‌ కేంద్రాలు) నుంచి మినహాయింపు పొందాలనుకునే వారు కోవిడ్ నెగెటివ్‌ ఉన్నట్లు నిర్ధారించే ఆర్టీపీసీఆర్‌ టెస్టు (RT-PCR test) చేయించుకున్న రిపోర్టును ప్రయాణికులు తప్పనిసరిగా జత చేయాలి.
ఇలాంటి ప్రయాణీకులకు నేరుగా 14 రోజులు హోం క్వారంటైన్ కు వెళ్లే అవకాశం కల్పిస్తారు.  ఆ టెస్ట్ కూడా విమానం ఎక్కడానికి 96 గంటల ముందే చేయించుకొని ఉండాలి. తప్పుడు సమాచారమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. 
* ఒకవేళ టెస్ట్ రిపోర్టు లేకపోతే ప్రయాణీకులు ఎయిర్ పోర్టులోనే యాంటిజెన్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఆ రిపోర్టు నెగిటివ్ అని వస్తే వారిని 14 రోజులు హోంక్వారంటైన్ కు అనుమతిస్తారు.
* ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు నిర్వహించడానికి అసవరమైన ప్రాంతాన్ని ఎయిర్ పోర్టు అధికారుల సహాయంలో ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించడం జరిగింది.
* కోవిడ్ టెస్ట్ ల ఆవశ్యకతను తెలిపేలా తగిన బ్యానర్లను ఏర్పాటు చేయాలి.
* ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ఎయిర్ పోర్టులోని సిబ్బంది దగ్గర అందబాటులో ఉంచేలా ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి.
* ఎయిర్ పోర్టులో కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారి నుంచి 500 రూపాయలు రుసుము వసూలు చేస్తారు. ఆ నగదుకు సంబంధించి రసీదు కూడా ఇస్తారు.
ఈ వసూలు ప్రక్రియను కలెక్టర్ల ఆధ్వర్యంలో నియమించబడిన అధికారులు సంబంధిత లావాదేవీలను పర్యవేక్షిస్తుంటారు. ఈ లావాదేవీలన్నింటికి ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఏర్పాటు చేయాలి. ఆ నగదు ఏపీఎంఎస్ఐడిసి ఎండీ అకౌంట్ కు బదిలీ అవుతుంది.
* ఎయిర్ పోర్టుల్లో కోవిడ్ టెస్టులు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఒక అధికారిని నియమించాలి.
సదరు అధికారి ఎయిర్ పోర్టుల్లో దిగిన ప్రయాణీకుల్లో పాజిటివ్ వచ్చినవారిని వేరు చేసి వారికి తగిన సూచనలు ఇవ్వాలి.
* ఎయిర్ పోర్టు్ల్లో చేసిన యాంటిజెన్ పరీక్షల ఫలితాలన్నింటినీ ఎప్పటికప్పుడు స్టేట్ పోర్టల్ లో పొందు పరచాలి.
* పాజిటివ్ వచ్చిన ప్రయాణీకులను కోవిడ్ నిబంధనల ప్రకారం తగిన సదుపాయాలతో ఆస్పత్రికి తరలించాలి.
*డాక్టర్ అర్జా శ్రీకాంత్*
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*

Related Posts