కర్నూలు ఆగస్టు 20,
శ్రీశైలం వరుసగా రెండో సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని అందుకుంది. వరద నీటితో పోటెత్తుతోంది. ఇన్ఫ్లో తగ్గకపోవడంతో.. జల వనరుల శాఖ అధికారులు రిజర్వాయర్ మూడు గేట్లను ఎత్తారు. వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బుధవారం సాయంత్రానికి రిజర్వాయర్లోకి 3.69 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. నీటి నిల్వ 881.30 అడుగులకు చేరుకుంది.దీనితో అధికారులు మూడు గేట్లను ఎత్తారు. వరద నీటిని దిగువకు వదిలారు. 71,321 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నారు. శ్రీశైలం వరద జలాల ప్రభావంతో పులిచింతల, నాాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంటున్నాయి. నాగార్జున సాగర్ క్రమంగా నిండుతోంది.