మదనపల్లి ఆగస్టు 20,
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, బొమ్మనచేరువు పంచాయతీ, టేకులపాలెంలో గురువారం నాటుసారాకు మరొకరు బలి అయ్యారు. భవన నిర్మాణ కార్మికుడు కటారి రమేష్ సారా తాగి చనిపోయి వారం కూడా తిరగకనే నాటుసారా తాగిన రైతు నారాయణ స్వామి (55) మృత్యువాత పడడంతో గ్రామస్తులు ఆందోళనకు గురౌతున్నారు. గ్రామానికి చెందిన పలువురు నాటు సారా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఎక్స్చేజ్ పోలీసులు పట్టించు కొకపోవడం, గ్రామ వాలంటీర్లు పోలీసులకు సమాచారం ఇవ్వక పోవడం వల్లనే సారా అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం అధిక రేట్లు పెట్టి కొనే స్తోమతలేని రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు యూరియా, సల్ఫేటు వేసి తయారు చేసిన నాటు సారా తాగడం వల్లనే ఈ మరణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.