YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

భూముల కొనగోలుపై దర్యాప్తు సీఎస్ కు లేఖ రాసిన చంద్రబాబు

భూముల కొనగోలుపై దర్యాప్తు సీఎస్ కు లేఖ రాసిన చంద్రబాబు

అమరావతి ఆగస్టు 20, 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాసారు. పేదలకు ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారంటూ అయన ఆరోపించారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఇళ్లపట్టాల పేరుతో భూసేకరణలో అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల భూములు లాక్కోవడం బాధాకరమన్నారు. ఇళ్ల నిర్మాణానికి అనువుగాని భూముల సేకరణ ఇంకో దుశ్చర్య అని చంద్రబాబు పేర్కొన్నారు. చిత్తడి నేలలు, ముంపు భూములు, మడ అడవులను ప్రభుత్వమే కొనడం దుర్భరమని అయన లేఖలోపేర్కోన్నారు.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి భూసేకరణ ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. 600ఎకరాల ఆవ భూములు ఇళ్లపట్టాల కింద సేకరించారన్నారు. ఎకరం రూ45లక్షల చొప్పున రూ 270కోట్లు ఖర్చుచేశారని వెల్లడించారు. ఆవ భూముల్లోనే మొత్తం రూ 500కోట్ల అవినీతి కుంభకోణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లపట్టాల భూసేకరణలో సరికొత్త అవినీతికి అంకురార్పణ జరిగిందన్నారు. అధికార వైసీపీ నాయకులు స్థానిక అధికారులతో కుమ్మక్కై దోపిడీకి పాల్పడుతున్నారని అయన విమర్శించారు.

Related Posts