నారాయణపేట ఆగస్టు 20,
భారత దేశ మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ.రాజీవ్ గాంధీ 76 జయంతిని పురస్కరించుకుని డీసీసీ ఆధ్వర్యంలో గురువారం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈసందర్భంగా నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి.వేణుగోపాల్ మాట్లాడుతూ చిన్న వయస్సు లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేశారన్నారు.రాజీవ్ గాంధీ కృషి ఫలితమే నేడు భారతదేశం డిజిటల్ రంగంలో దూసకపోతుందన్నారు.మహిళ సాధికారతకు కృషి చేస్తూ వారు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్లు అమలు అయ్యే విధంగా కృషి చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందన్నారు.పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి అండగా నిలిచారన్నారు.
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శశికాంత్ చామకూర, కౌన్సిలర్ ఎం.డి సలీం,మాజీ కౌన్సిలర్లు బోయ రమేష్,సూర్యకాంత్,మండల యువజన అధ్యక్షులు కోట్ల.రవీందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.