అమరావతి ఆగస్టు 20,
మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. వైఎస్సార్ చేయూత కింద 23 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూతుంది. వైఎస్సార్ చేయూత కింద ఈ ఏడాది రూ.4,700ల కేటాయింపు జరిగింది. నాలుగేళ్లలో 17 వేల కోట్ల కేటాయింపులుంటాయని పశు సంవర్ధక, మత్స్య, మార్కెంటింగ్ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద రూ.18,750ల చొప్పున నాలుగేళ్లలో విడతల వారీగా ఇచ్చే రూ.75 వేల మొత్తాన్ని ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తున్నాం. ఒకేసారి అందే ఆర్థిక సాయంతో మహిళలు ఆర్థిక సుస్థిర సాధించడానికి అవకాశం కలుగుతుంది. పశు సంవర్ధక, మత్స్యకా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే వ్యక్తిగత, గ్రూపు యూనిట్ల ఏర్పాటుకు మహిళల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 12,81,067 దరఖాస్తులు వచ్చాయని మంత్రి అన్నారు. వైఎస్సార్ చేయూత కింద నాలుగేళ్లకు 11 వేల కోట్లు, వైఎస్సార్ ఆసరా కింద నాలుగేళ్లకు 17 వేల కోట్లు....మొత్తం మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.28 వేల కోట్లకు పైగా కేటాయింపులుంటాయి. పశు సంవర్ధక, మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిగత, గ్రూపు యూనిట్ల ఏర్పాటు చేస్తున్నాం. మహిళలు తమకు నచ్చిన యూనిట్లు ఏర్పాటు చేసుకొవొచ్చుని అన్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలతో మహిళలు ఆర్థిక స్వాలంబన సాధిస్తారని అయన అన్నారు.