YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్ నామినేట్

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా కమలా హారిస్ నామినేట్

వాషింగ్టన్ ఆగష్టు 20 
కమలా హారిస్ .. ఇప్పుడు ఈ పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోతుంది . అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా మొట్టమొదటి సరిగా  అమెరికా ఎన్నికల్లో  ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న నల్లజాతి మహిళగా రికార్డ్ సృష్టించారు. అమెరికా ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ స్వీకరించి కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.  డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం పోటీలో నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాహిల్లరీ క్లింటన్ల సమక్షంలో నవంబరులో జరగనున్న ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా   కమలా హారిస్ నామినేట్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడిన కమలా హారిస్ ..  ప్రస్తుత అమెరికా  అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు  కురిపించారు. ట్రంప్ ప్రభుత్వం వైఫల్యం ప్రజల జీవితాలను జీవనోపాధిని నాశనం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన బాధల్ని విషాదాలను రాజకీయ ఆయుధాలుగా మలుచుకున్న ట్రంప్ ను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మన సవాళ్లను స్వీకరించి విజయాలుగా మలిచే మనందరినీ ఏకతాటిపైకి తెచ్చే అధ్యక్షుడిగా జో బిడెన్కు ఓటు వేసి గెలిపించాలని అమెరికన్లను కోరారు. తన తల్లి నేర్పిన విలువలకు బిడెన్  విజన్ కు కట్టుబడి ఉంటానంటూ ట్వీట్ చేశారు.  ఆ తర్వాత అమెరికా తొలి నల్లజాతి అద్యక్షుడైన బరాక్ ఒబామా మాట్లాడుతూ ..   బిడెన్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.  కాగా నవంబరు 3న జరగనున్న ఎన్నికల్లో ఒపీనియన్ పోల్ లో ట్రంప్ కంటే జో బిడెన్   ముందంజలో ఉన్నారు. చూడాలి మరి ఈసారి అధ్యక్ష పదవిని ఎవరు వరిస్తారో ..

Related Posts