YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్సేవలకి అంతరాయం

ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్సేవలకి అంతరాయం

న్యూ ఢిల్లీ  ఆగష్టు 20 
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీమెయిల్ ను ఉపయోగిస్తుంటారు. వ్యక్తులు సంస్థలు నిత్యం సమాచార మార్పిడికి జీమెయిల్ పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అటువంటి జీమెయిల్ ఒక్కసారిగా పనిచేయకుండా ఆగిపోతే ఎంతోమందికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం అదే జరిగింది.దాదాపు గంట నుంచి మెయిల్ పంపుతున్నా - ఫైల్స్ అటాచ్ చేస్తున్నా సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. దీనితో  యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. ముఖ్యంగా జీమెయిల్ సహాయం సేవలు చేసే వారికి పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో జీమెయిల్ డౌన్ అన్న హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం  ట్రెండ్ అవుతోంది.ఈ పరిస్థితి కేవలం మన దేశంలోనే కాదు సేవలకి అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా చాలా జీమెయిల్ ఇక ఈ విషయాన్ని గూగుల్ కూడా ఇప్పటికే ధ్రువీకరించింది. మరోవైపు చర్యలను పునరుద్దరించే పనిలో గూగుల్ టీమ్ నిమగ్నమైంది. కాగా రెండు నెలల్లో జీమెయిల్ షట్ డౌన్ అవ్వడం ఇది రెండోసారి. జూలై నెలలో యూజర్లు లాగిన్ కూడా అవ్వలేకపోయారు. దీంతో రంగంలోకి దిగిన గూగుల్ టీమ్.. సమస్యను పరిష్కరించింది. అయితే ఇలా ఎందుకు జరిగిందన్న విషయంపై మాత్రం ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Related Posts