YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎస్ పి ఎం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వినతి పత్రం

ఎస్ పి ఎం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వినతి పత్రం

ఆసిఫాబాద్ ఆగష్టు 20 
కాగజ్ నగర్ ఎస్పీయం మిల్లులో ఇంతకు ముందు పని చేసిన 260 మంది పర్మినెంట్ కార్మికులను, 800 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈసందర్భంగా కలెక్టర్  సావధానంగా విని సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యంతో మరియు పరిశ్రమల శాఖ కార్యదర్శితో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి డా పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం పున:ప్రారంభమైన సిర్పూర్ పేపర్ మిల్లు వలన స్థానికులకు కానీ, పాత కార్మికులకు కానీ, పట్టణానికి చెందిన నిరుద్యోగ యువతకు కానీ, ఉద్యోగస్తులకు ఎలాంటి లాభం చేకూరలేదు. 260 మంది శాశ్వత కార్మికులను 800 కాంట్రాక్ట్ కార్మికులను ఇంకా విధుల్లోకి తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల నుంచి 3000 మంది కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకొని వారికి పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తూ ఇక్కడి స్థానికులకు అన్యాయం చేశారు. కాబట్టి ఈ విధానాన్ని నిరసిస్తూ దశల వారీగా ఉద్యమాన్ని కార్మిక ఉద్యమంగా, ప్రజా ఉద్యమంగా మలచడానికి అఖిల పక్షం నాయకులం అందరం సిద్దంగా ఉన్నాము. తప్పకుండా ఎస్పియం యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడాలని, పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వీరికి పాత బకాయిలను చెల్లించాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎస్పియం యాజమాన్యం ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో భారీ రాయితీలు పొంది ఇక్కడి కార్మికులకు అన్యాయం చేయడం సమంజసం కాదు"* అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సీపీఐ పార్టీ మాజీ శాసన సభ్యులు గుండా మల్లేష్, సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డా పాల్వాయి హరీష్ బాబు, డిసిసి ఓబీసీ చైర్మన్ దాసరి వెంకటేశ్, నిరుద్యోగ జెఎసి జిల్లా కన్వీనర్ పొన్న రమేష్, మాజీ కౌన్సిలర్ షబ్బీర్, సిర్పూర్ నియోజక వర్గ బిజేపి ఇంఛార్జి కొత్తపల్లి శ్రీనివాస్, టిడిపి ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు గుల్లపల్లి ఆనంద్, నెగోసియేషన్ కమిటీ అధ్యక్షులు సూర్యనారాయణ, సీపీఐ, సీపీఎం నాయకులు అంబాల ఓదెలు,ఆనంద్, మరియు ఇతర అఖిల పక్ష నాయకులు పాల్గొన్నారు.
=

Related Posts