YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

డ్రగ్స్ కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అవుతోందా?!

డ్రగ్స్ కు హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ అవుతోందా?!

హైదరాబాద్ ఆగస్టు 20
మహానగరం హైదరాబాద్ లో తవ్వినకొద్దీ డ్రగ్స్ బయటపడుతున్నాయి. అక్రమార్కులు ఎక్కడ దాచిపెట్టాలో తెలియక ఏకంగా భూమిలో కిలోల కొద్దీ పాతిపెట్టి హైదరాబాద్ లో దందా చేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. ఇటీవలే హైదరాబాద్ శివారుల్లో భారీగా డ్రగ్స్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు.  దాదాపు రూ.50 కోట్లు విలువ చేసే 250 కేజీల మత్తుమందును.. రూ.45 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  మూడు రోజులుగా ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ వస్తున్నట్టు పక్కా సమాచారం ఆధారంగానే ఈ డ్రగ్స్ ను పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కార్గో బస్సులో హైదరాబాద్ నుంచి ముంబైకి ఈ మత్తుమందును తరలిస్తున్నట్టు చెప్పారు.తాజాగా గురువారం నగరంలో మరోసారి భారీ డ్రగ్స్ డంప్ పట్టుబడింది. జిన్నారం పారిశ్రామిక ఆవరణలో భూమిలో పాతిపెట్టిన 6 కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్స్ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. 52 కిలోల  డ్రగ్స్ డంప్ ను డ్రగ్స్ మాఫియా గుంతలో దాచిపెట్టింది. జిన్నారంలోని మేక ల్యాబోరేటరీలో మూడు రోజుల క్రితం రూ.100 కోట్లు విలువ చేసే డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు వెంకటరెడ్డి ఇచ్చిన సమాచారంతో తాజాగా పాతిపెట్టిన డ్రగ్స్ ను వెలికితీశారు.మూసివేసిన పరిశ్రమలు కోళ్ల ఫారాలను డ్రగ్స్ ముఠా లీజ్ ను తీసుకొని ఈ దందా సాగిస్తున్నారని విచారణలో తేలింది.ఇందులో ఇన్ సైడ్ టాక్ ఏంటంటే.. మొన్న 50 కోట్ల విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నారు.. మళ్లీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే దేశంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్  వాడుతున్నారా అన్న అనుమానాలు కలుగుకమానదు.. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడం నిజంగా మన భావితరాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకుంటేనే భయానకంగా మారుతోంది. మరో పంజాబ్ లాగా హైదరాబాద్ కూడా డ్రగ్స్ కు బానిసగా మారిపోతుందా.. మన యువతరం అంతా డ్రగ్స్ మత్తులో చిత్తు అవుతోందా అన్న భయాలు వెంటాడుతున్నాయి.

Related Posts