నెల్లూరు ఆగస్టు 20
మదర్ తెరిసా జన్మదినోత్సవం సందర్భంగా విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ సువర్ణ కుమారి ఆధ్వర్యంలో సింహపురి ప్రజలకు శానిటైజర్, మాస్కులు , కరోనా వైరస్ వ్యాధి నియంత్రణ మాత్రలు గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నెల్లూరు నగరంలోని స్థానిక పొగతోట ప్రాంతంలో ఉన్న స్వతంత్ర పార్కు నందు నిర్వహించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ సువర్ణ కుమారి మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచ దేశాల ప్రజలను గడగడలాడిస్తున్న నేపథ్యంలో అనేకమంది ప్రజలు తన ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. ఇటువంటి విపత్కర, ఆపత్కాలంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో తన వంతు సింహపురి ప్రజలకు చేయూత ఇవ్వాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగిందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రజలు కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. శానిటైజర్ లు వినియోగిస్తూ, మాస్కులు ధరించి తమ ఆరోగ్యాలను కాపాడుకో కోవాలని సూచించారు. ఈ సందర్భంగా వెయ్యి మందికి పైగా విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ప్రకృతి సిద్ధంగా తయారుచేయబడిన శానిటైజర్ లు మరియు హోమియోపతి మందులు పంపిణీ తో పాటు, ఆధునిక మాస్క్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వంభర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాగిరెడ్డి, జయ ప్రకాష్, మురళీ మోహన్ రాజు, కృష్ణమూర్తి, హరి తదితరులు పాల్గొన్నారు.