YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడి గడ్డం రహస్యమేమిటి ?

మోడి గడ్డం  రహస్యమేమిటి ?

న్యూ ఢిల్లీ ఆగష్టు 20 
మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఒకట్రెండు విషయాల్లో ప్రధాని మోడీచాలా కచ్ఛితంగా ఉంటారు. తాను వేసుకునే దుస్తుల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తానుపాల్గొనే కార్యక్రమానికి తగ్గట్లుగా ఆయన దుస్తుల ఎంపిక ఉంటుంది. ఆ మాటకు వస్తే.. గడిచిన పాతికేళ్లలో దేశ ప్రధాని ధరించే దుస్తుల గురించి దేశంలో చర్చ జరిగిన దాఖలాలు లేవు. ఆ కొరతను మోడీ తీర్చేశారని చెప్పాలి.దుస్తులతో పాటు.. హెయిర్ స్టైల్.. గడ్డం అన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండటం కనిపిస్తుంది. అలాంటి మోడీ.. ఇటీవల కాలంలో మార్పుగా కనిపిస్తున్నారు. ఎప్పటి మాదిరి గడ్డం ఉన్నా.. ఇటీవల కాలంలో అది కాస్తా అంతకంతకూ పొడువు పెరుగుతోంది. ఈ మార్పు ఇటీవల మరింత పెరిగింది. బారు గడ్డంతో పాటు.. మీసాలుకూడా పెరిగాయి. దీంతో.. మోడీ ముఖంలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.చూసినంతనే రుషిని గుర్తుకు తెచ్చేలా ప్రధాని మోడీ రూపం ఉందని చెప్పాలి. ఇంతకూ.. ఆయన గడ్డాన్ని ఎందుకంతలా పెంచుతున్నట్లు? దాని వెనకున్న కారణం ఏమిటన్న విషయంపై ఇప్పటివరకు వివరాలు వెల్లడి కాలేదు. కాకుంటే.. బీజేపీ వీరాభిమానులు కొందరు కరోనా లెక్క తేలేంతవరకు తన గడ్డాన్ని ట్రిమ్ చేయకుండా ఉండాలని మోడీ అనుకున్నట్లు చెబుతున్నారు.. అది అతిశయోక్తిగా చెప్పక తప్పదు.ఇదిలా ఉంటే.. మోడీ గడ్డం వెనుక కథ వేరే ఉందంటున్నారు. మరికొద్ది నెలల్లో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గడిచిన సారి ఎంతగా ప్రయత్నించినా.. దీదీ పార్టీని దెబ్బ వేయలేని పరిస్థితి కమలనాథులది. అప్పటి నుంచి బెంగాల్ ను చేజిక్కించుకోవటానికి వారెన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించటం లేదు. ఇదిలా ఉంటే.. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన మారిన రూపంతో.. బెంగాలీలు అమితంగా ఆరాదించే రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరి కనిపించేలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఠాగూర్ కు కూడా పొడవాటి తెల్లటి గడ్డం ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇలా తన రూపంతో బెంగాలీల మనసుల్ని దోచుకోవాలన్న లెక్కలో భాగంగానే మోడీ రూపంలో మార్పు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజమెంతన్న విషయాన్ని మోడీకి సన్నిహితంగా ఉండే నేతలు రివీల్ చేస్తే బాగుంటుందేమో?

Related Posts