YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆగస్ట్ 31తో ముగియనున్న లోన్ మారటోరియం...!!

ఆగస్ట్ 31తో ముగియనున్న లోన్ మారటోరియం...!!

న్యూ ఢిల్లీ  ఆగష్టు 20 
కరోనా లాక్ డౌన్  నేపథ్యంలో అన్ని కూడా బంద్ అవ్వడంతో  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  మారటోరియం ప్రకటించింది. దీనితో ఆర్బీఐ కల్పించిన లోన్ మారటోరియాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది వాడుకుంటున్నారు. అయితే ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం ఆగస్ట్ 31 కి ముగియబోతుంది. లాక్ డౌన్ కారణంగా గత  మూడు నెలలపాటు వ్యాపార కార్యకలాపాల్లేక అన్ని రంగాల్లో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.లాక్డౌన్ నుండి సడలింపులు ఇచ్చినా కూడా  డిమాండ్ లేమి కారణంగా బిజినెస్ లు అంతగా సాగడంలేదు. వ్యాపారాలు కోలుకోవడానికి మరో ఆరు నెలల నుండి ఏడాది పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.  ఈ క్రమంలోనే లోన్ మారటోరియంను మరోసారి పొడిగించాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ ఆర్బీఐని కోరుతోంది. గత కొద్ది నెలలుగా ఇంటర్-స్టేట్ లారీలు నిలిచిపోయాయని ఈ ప్రభావం రోడ్డు ట్రాన్సుపోర్ట్ రంగంపై ఎక్కువగా పడిందని అన్ని రంగాల్లోని చిన్న ఆపరేటర్లపై కరోనా లాక్ డౌన్ ప్రభావం ఎక్కువగా ఉందని 85 శాతం వ్యాపారం ఉన్న కార్గో పాసింజర్ వాహనాల వ్యాపారం తీవ్ర అనిశ్చితిలో ఉందని ఏఐఎంటీసీ   వెల్లడించింది.ఆర్థిక కార్యకలాపాల మందగించడం తక్కువ సరుకు లభ్యత ఆగస్ట్ 31న ముగియనున్న లోన్ మారటోరియం ఇప్పట్లో మళ్లీ పుంజుకుంటుంది అన్న ఆశాభావం లేకపోవడంతో  ట్రాన్స్ పోర్టర్స్ 50000 వాహనాలను ఫైనాన్షియర్లకు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకునే దిశలోఆలోచన చేస్తున్నారట. ముఖ్యంగా ఆగస్ట్ నెలలో సరుకు రవాణా పది శాతం మేర క్షీణించిందని చెబుతున్నారు. పరిస్థితి ఏమాత్రం బాగా లేదని ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రెయినిగ్  తెలిపింది. ఈ క్రమంలోనే కొంతమంది ట్రాన్సుపోర్ట్ బిజినెస్ తగ్గించుకోవాలని చూస్తుండగా ..  మరికొంతమంది పూర్తిగా మానేయాలని చూస్తున్నారట. అలాగే ఇప్పటికే పంపిణీ చేసిన రుణాలలో రికవరీ కనిపించడం లేదని కొత్త వాహనాలకు క్రెడిట్ పొందటం ప్రధాన సమస్యగా మారిందని రుణ తిరస్కరణ రేట్లు పెరిగాయని చెబుతున్నారు. వాహనాల స్వాధీనం లేదా సరెండర్ కేవలం హైప్ మాత్రమేనని ఫైనాన్షియర్లు కూడా కస్టమర్ల ఇబ్బందులను గుర్తించారని అంటున్నారు. ప్రస్తుతం సగం డిమాండ్ కూడా లేదని ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియం పొడిగించాలని కోరుతున్నారు.

Related Posts