YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్వచ్ఛ సర్వేక్షణ్ టాప్ 10 లో ఏపీ నగరాలు

స్వచ్ఛ సర్వేక్షణ్ టాప్ 10 లో ఏపీ నగరాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 20, 
కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల కిందట ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనబరిచిన పట్టణాలకు ఏటా అవార్డులను ప్రధానం చేస్తున్నారు.స్వచ్ఛ సర్వేక్షణ్-2020 జాబితాను కేంద్రం గురువారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ జాబితాలో మరోసారి ఇండోర్ తొలి స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ నగరం వరుసగా నాలుగోసారి మొదటి స్థానం సాధించడం విశేషం. గుజరాత్‌లో సూరత్ రెండో స్థానంలోనూ, నవీ ముంబై మూడో స్థానంలో నిలిచాయి. మొదటి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాాలకు చోటు దక్కింది.నాలుగో స్థానంలో విజయవాడ, ఆరో స్థానంలో తిరుపతి, తొమ్మిదో స్థానంలో విశాఖపట్టణం నగరాలు నిలిచాయి. విర్చువల్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవంలో మొత్తం 129 పట్టణాలు, రాష్ట్రాలకు అవార్డులను ప్రకటించారు.దేశంలోని మొత్తం 4,242 నగరాలు, పట్టణాలు, 62 కంటోన్మెంట్ బోర్డులు, 92 గంగా పరివాహక ప్రాంతాల్లోని పట్టణాల్లో సర్వే నిర్వహించారు. మొత్తం 28 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులను కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను 2016 నుంచి ప్రకటిస్తుండగా.. తొలి సంవత్సరం మైసూరు మొదటి స్థానంలో నిలిచింది.ఈ సారి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేను మొత్తం డిజిటల్ విధానంలోనే రికార్డు స్థాయిలో నిర్వహించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి తొలిసారి 2014 అక్టోబరు 2న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రారంభించారు.కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ‘కొన్నేళ్ల కిందట జపాన్ ప్రతినిధులతో కలిసి ఇండోర్ నగరంలో పర్యటించాను.. జపాన్ ప్రతినిధులు పలు చోట్లకు వెళ్లారు.. చెత్త ఎక్కడుందా? అని పరిశీలించారు.. వారికి ఎక్కడా దాని ఆనవాళ్లు కనిపించలేదు.. నగరం సాధించినందుకు ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఉండవచ్చని నేను అనుకోను’ అని అన్నారు.

Related Posts