YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ

ఆగిపోయిన అల్లూ రామాయణం

ఆగిపోయిన అల్లూ రామాయణం

హైద్రాబాద్, ఆగస్టు 20, 
‘బాహుబలి’ సిరీస్ సూపర్ సక్సెస్ కావడంతో పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలను తెరకెక్కించడానికి మళ్లీ నిర్మాతలు ధైర్యం చేస్తున్నారు. ‘బాహుబలి’ ఇచ్చిన ధైర్యంతోనే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తీసే ధైర్యం చేశారు. అలాగే, ఇతిహాస గాథలు మహాభారతం, రామాయణం ఆధారంగా సినిమాలు తీయడానికి కొంత మంది నిర్మాతలు భారీ ప్రకటనలు చేశారు. యూఏఈలో స్థిరపడిన మలయాళీ వ్యాపారవేత్త బి.ఆర్.శెట్టి.. మోహన్‌లాల్‌తో ‘రందమూళం’ అనే సినిమాను ప్రకటించారు. మహాభారతం ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాను రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తామని ప్రకటించారు.కానీ, పలు కారణాల వల్ల ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అలాగే, ఆమిర్ ఖాన్ కృష్ణుడు లేదా కర్ణుడు పాత్రలో ‘మహాభారత్’ సినిమాను ప్లాన్ చేశారు. ఇదీ కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, కిందటేడాది అల్లు అరవింద్ ‘రామాయణం’ చిత్రాన్ని ప్రకటించారు. భారత సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రంగా దీన్ని ప్లాన్ చేశారు. 3డి టెక్నాలజీతో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు.భారీ చిత్రం నిర్మాణం కోసం మధు మంతెన, నమిత్ మల్హోత్ర (ప్రైమ్ ఫోకస్)తో అల్లు అరవింద్ జతకట్టారు. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యవార్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించనున్నారని అధికారికంగా వెల్లడించారు. రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌ని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ ప్రకటించి ఏడాది దాటుతున్నా దీనిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇక ఈ సినిమా ఆగిపోయినట్టే అని గత కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతమైతే ఈ సినిమా ఆగిపోయిందని ఇండస్ట్రీలోని చాలా మంది అంటున్నారుప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే సినిమాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘తానాజీ: ది అన్‌సంగ్ హీరో’ ఫేమ్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. టి-సిరీస్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. అయితే, ఈ సినిమా ప్రకటించిన తరవాత తన ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ను పూర్తిగా విరమించుకున్నారట అల్లు అరవింద్. నిజానికి అల్లు అరవింద్ తన రామాయణం సినిమాలో ప్రభాస్‌ను కూడా భాగం చేద్దామని అనుకున్నారట. కానీ, ఆయన ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమాను అంగీకరించడంతో తన ‘రామాయణం’ ప్రాజెక్ట్‌ను అల్లు అరవింద్ పక్కన పెట్టేశారని టాక్ వినిపిస్తోంది.

Related Posts