YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కోవిడ్ కు చికిత్స అందిస్తున్న నకిలీ ఆర్ఎంపి అరెస్ట్ - జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్

కోవిడ్ కు చికిత్స అందిస్తున్న నకిలీ ఆర్ఎంపి  అరెస్ట్ - జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్

కర్నూలు, ఆగస్టు 20, 
కర్నూలు జిల్లా ఉయ్యాల వాడ గ్రామం కొయిటాల వీధిలో నివాసం ఉంటున్న డి.రంగన్న ఉరఫ్ టైలర్ రంగన్న అనే నకిలీ ఆర్ఎంపి డాక్టర్ అనధికారికంగా కోవిడ్ పేరుతో పేషేంట్స్ కు చికిత్స అందిస్తూ అమాయక ప్రజల నుండి డబ్బులు గుంజుతూ, కోవిడ్ వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారని ఫిర్యాదు రావడంతో నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి తో విచారణ చేయించి, కోయిలకుంట్ల విఆర్ఓ రవిప్రసాద్ రావు తో బుధవారంనాడు కోయిలకుంట్ల పోలీస్ స్టేషన్ లో వ్రాత పూర్వక కంప్లైంట్ ఇప్పించి.. ఐపీసీ సెక్షన్ 188,269,270,420 ల కింద తక్షణమే క్రిమినల్ కేసును పెట్టించి చట్టప్రకారం కోయిలకుంట్ల పోలీసులతో అరెస్ట్ చేయించినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జి.వీరపాండియన్ బుధవారం నాడు విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన లో తెలిపారు.
జిల్లాలో ఎవరైనా సరే నకిలీ డాక్టర్ల పేరుతో,  ఆర్ఎంపి ల పేరుతో  లేదా ప్రభుత్వ అనుమతి లేని డాక్టర్లు  అనధికారకంగా కోవిడ్ కు చికిత్స పేరుతో ప్రజలను లూటీ చేస్తూ..కోవిడ్ వైరస్ వ్యాప్తికి కారణమైతే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు  క్రిమినల్ కేసులు పెట్టి పోలీసుల ద్వారా అరెస్ట్ చేయిస్తామని  కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా ప్రజలకు సూచనలను ఇస్తూ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వైద్యం కోసం నకిలీ ఆర్ఎంపిల డాక్టర్ల  వద్దకు వెళ్లవద్దని, కోవిడ్ పాజిటివ్ వస్తే స్థానిక మెడికల్ ఆఫీసర్, ఏ.ఎన్.ఎం, ఆశా వర్కర్, గ్రామ, వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శి, వాలంటీర్ల సూచనలను పాటించి..ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల కు లేదా ప్రభుత్వం గుర్తించిన ప్రయివేటు కోవిడ్ ఆస్పత్రులు లేదా ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లకు వెళ్లి చికిత్స పొందాలని కలెక్టర్ వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు.
అలాగే, కోవిడ్ కు సంబంధించిన అన్ని విషయాలకు ప్రభుత్వ  104 కాల్ సెంటర్ కు ఫోన్ చేసి చెప్పాలని , వెంటనే జిల్లా యంత్రాంగం తగు చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.

Related Posts