విజయవాడ, ఆగస్టు 21,
ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత ఏడాదిన్నరగా పాలనపైనే దృష్టి పెట్టారు. తొలి ఏడాదిన్నర సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేయడానికే జగన్ ఎక్కువ సమయం కేటాయించారు. పార్టీని పూర్తిగా పక్కన పెట్టేశారు. తాను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో జగన్ అందరికీ స్కీమ్ లు అందించేందుకే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు కూడా జగన్ ను పార్టీపై ఫోకస్ చేయాలని కోరారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత జగన్ మంత్రులతో జగన్ కాసేపు పిచ్చా పాటీ మాట్లాడారు.ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటు మరికొందరు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని కోరారు. మిగిలిన మంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ నేతలతో సమీక్ష చేస్తే బాగుంటుందని సూచించారు. దీనికి జగన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీని గతంలో మాదిరిగా యాక్టివ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత లేదు. గ్రూపులుగా విడిపోయారు. దాదాపు ఎనభై నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితివిభేదాలు మరింత ముదిరితే…..పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి, విభేదాల పరిష్కారానికి ఇన్ ఛార్జులను నియమించినా పెద్దగా ఫలితం లేదని జగన్ గుర్తించారు. ఈ విభేదాలు మరింత ముదిరేంత వరకూ వెళితే తాను ఇన్ వాల్వ్ అయినా సమసి పోదని గుర్తించిన జగన్ తక్షణమే నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం పార్టీకి కొంత సమయం కేటాయిస్తానని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. క్యాడర్ లో కూడా జోష్ నింపాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టచ్ లోకి రావాలని జగన్ భావిస్తున్నారుదీంతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు యాక్టివ్ కావాలని జగన్ ఆదేశించారు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు వెంటనే చెక్ పెట్టేలా కౌంటర్లు ఇవ్వాలని చెప్పారు. దీంతో పాటు పార్టీ సోషల్ మీడియాను కూడా యాక్టివ్ చేయాలని జగన్ సూచించారు. ఎన్నికలకు ముందు ఉన్న జోష్ ఇప్పుడు పార్టీ సోషల్ మీడియాలో లేదని జగన్ గుర్తించారు. పార్టీ క్యాడర్ ను ఉత్సాహపరిచేందుకు పలు కార్యక్రమాలను డిజైన్ చేయాలని, తాను అందులో పాల్గొంటానని జగన్ సీనియర్ నేతలను ఆదేశించారు. మొత్తం మీద పార్టీ పై ఫోకస్ పెట్టేందుకు జగన్ రెడీ అయిపోయారు.