ఏలూరు, ఆగస్టు 21,
మళ్ళీ రాజుగారి రచ్చ... జగన్‌కి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మళ్ళీ తన విమర్శలకు పదును పెట్టారు. తాజాగా ఆయన గోదావరి జిల్లాలలో ఆవ భూముల కుంభకోణంపై విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. విలేకరులతో ఆయన అనేక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రాన్ని ఫోన్ ట్యాపింగ్ అంశం కుదిపేస్తోందని, దీనిపై కేంద్ర హోం శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్నారు.ఈ విషయంలో తాను కూడా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేసానన్నారు. గోదావరి జిల్లాలలో అవ భూములను కాజేసిన దొంగలను శిక్షించాలి. ముఖ్యమంత్రి కి సొంత బంధువులయినా మినహాయింపు ఇవ్వవద్దు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్రానికి సంబంధం లేదనడం అసమంజసం. ఈ విషయంలో రాష్ట్రానికో విధానం వేరుగా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్ర హోం శాఖ పరిధిలోని అంశం అన్నారు నర్సాపురం ఎంపీ. ఏపీ ప్రభుత్వం కోవిడ్ కేంద్రాల భద్రతపై ప్రత్యేక దృష్టి ఫోన్ ట్యాపింగ్ కు ఎవరుపాల్పడినా శిక్షించాల్సిందే. లాక్ డౌన్ సడలింపులు రాకముందే మసీదులు, చర్చిలలో ప్రార్ధనలకు అనుమతించినప్పుడు, వినాయక ఉత్సవాలకు ఆటంకాలు కలిగించకుండా అనుమతించాలి. 85శాతం హిందూ ప్రజల మనోభావాలను గాయపరచవద్దన్నారు. భక్తుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూనే వినాయక మండపాలకు అనుమతి ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ముఖ్యమంత్రి దీనిపై అధికారులతో తక్షణమే సమీక్షసమావేశాలు జరపాలన్నారు. ప్రభుత్వంలో పెద్దలకు కరోనా వచ్చినప్పుడు హైదరాబాద్ పంపిమరీ వైద్యం చేయించినపుడు, ఒక కరోనా కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా మంచి వైద్యం అందించాల్సిన అవసరం లేదా అన్నారు. ఆయనకు జరగరానిది జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సీఎం జగన్ తన తండ్రిలా వ్యవహరించాలని, కక్షసాధింపు చర్యలకు దిగవద్దన్నారు. ఇదిలా ఉంటే ఎంపీ తీరుపై స్వంత నియోజకవర్గంలోని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తనను అడ్డుకుంటే కాల్చిపారేస్తానని ఇటీవల ఎంపీ చేసిన కామెంట్లపై పాలకొల్లు, నర్సాపురం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.