YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

డీఎంకేలో నేతలు...యూ టర్న్

డీఎంకేలో నేతలు...యూ టర్న్

చెన్నై, ఆగస్టు 21, 
మిళనాడు రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని చేజిక్కించుకునే తమిళనాడులో పార్టీలలో క్రమశిక్షణ తప్పితే వేటు తప్పదు. జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలో దశాబ్దకాలంలో పార్టీ నేతలు గీత దాటే వారు కాదు. నమ్మకమైన నేతలుగా వ్యవహరించే వారు. పార్టీ నేతల కదలికలపై ఎప్పుడూ నిఘా ఉంటుంది. అందుకే జయలలిత, కరుణానిధి ఉన్న సమయంలో నేతలు తోక జాడించే వారు కాదు.కానీ వారి మరణంతో ఇప్పుడు అన్నాడీఎంకే, డీఎంకేలకు నాయకత్వ సమస్య ఏర్పడింది. ముఖ్యంగా డీఎంకే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. స్టాలిన్ సమర్థవంతమైన నాయకత్వం అందిస్తున్నా నేతలను కట్టడి చేయడంలో మాత్రం విఫలమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల్లో సహజంగా ఏక నాయకత్వమే ఉంటుంది. వారు చెప్పిందే వేదం. ప్రజాస్వామ్యం అనేది ప్రాంతీయ పార్టీల్లో కన్పించదు.కానీ కరుణానిధి, జయలలిత మరణం తర్వాత డీఎంకేలో అనేక మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ ను థిక్కరించారు. నాయకత్వాన్ని ప్రశ్నించారు. వీరిపై అనర్హత వేటు వేసినా తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఆ సీట్లను దక్కించుకోలేక పోయింది. ఇది ఖచ్చితంగా నాయకత్వ లేమిని సూచిస్తుంది. ఇక డీఎంకేలో కూడా తాజాగా జరిగిన పరిణామాలు పార్టీ నాయకత్వాన్ని థిక్కరిస్తున్నట్లే కన్పిస్తున్నాయి.నిజానికి డీఎంకే కు తమిళనాడులో అనుకూల పవనాలు వీస్తున్నాయంటున్నారు.ఈ పరిస్థితుల్లో డీఎంకే ఎమ్మెల్యే పార్టీ లైన్ ను థిక్కరించారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సెల్వం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఢిల్లీలో కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయనను పార్టీ నుంచి బహిష‌్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. సెల్వం బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విచారణలో తేలడంతోనే డీఎంకే ఈ చర్యలకు దిగింది. దీనిని బట్టి తమిళనాడులోనూ ప్రతిపక్ష పార్టీ డీఎంకేను బలహీన పర్చే ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించిందనే అనుకోవాల్సి ఉంటుంది.

Related Posts