శ్రీశైలం ఆగస్టు 21,
శుక్రవారం ఉదయం శ్రీశైలం డ్యామ్ పది గేట్లు ఎత్తి వరద నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ కు వదిలిన సందర్భంగా శ్రీశైలం డ్యామ్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవి పట్టన్ షెట్టి, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డి, కంగాటి శ్రీదేవి జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, శ్రీశైలం ఈఓ రామారావు, నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీనా, ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ /డ్యామ్ వివరాలను, వరద పరిస్థితి, ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలందర్, సీఈ మురళీనాథ్ రెడ్డి, (ప్రాజెక్ట్స్) శ్రీనివాసులు తదితర ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. శ్రీశైలం డ్యామ్ ఎడమగట్టున ఉన్న తెలంగాణా జెన్కో పవర్ హౌస్ అగ్ని ప్రమాదంపై కుడి గట్టున ఉన్న ఏపీ జెన్కో సీఈ నరసింహారావు ను వివరాలను మంత్రి బుగ్గన అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మన రాష్ట్రం జెన్కో వైపు నుండి , పోలీసు,రెవెన్యూ, ఇరిగేషన్ , అగ్నిమాపక తదితర శాఖ ల నుండి ఏ సహాయం అడిగినా వెంటనే చేయండని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏపీ జెన్కో తరఫున టీఎస్ జెన్కో లో నిన్న అర్ధరాత్రి ప్రమాదం జరిగినప్పటి నుండి అన్ని రకాల సహాయం అందిస్తున్నామని, ఈ ఉదయం కూడా అంబులెన్స్, డాక్టర్లు, క్రేన్, సిబ్బంది, ఇతర సాయం చేసామని ఆర్థిక మంత్రికి సీఈ నరసింహా రావు వివరించారు.