తిరుమల ఆగస్టు 21,
పలువురు పీఠాధిపతులు, స్వామీజీలతో చర్చించే బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం ఈ అంశంపై స్పందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ ప్రభుత్వం బాధ్యత అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర గైడ్లైన్స్ మేరకే వినాయక చవితి ఉత్సవాలపై నిర్ణయం తీసుకున్నామన్నారు పొరుగు రాష్ట్రాల్లో ను ఉత్సవాలు జరగడం లేదని గుర్తు చేశారు ఈ అంశంపై కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ,వైసీపీ ప్రభుత్వానికి ఒక మతాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం పై ఆరోపణలు చేస్తున్న వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు నిజంగానే హిందూమతంపై నమ్మకం ఉంటే నియోజకవర్గానికి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని ఢిల్లీలో కూర్చొని నాటకాలు ఆడటం కాదన్నారు చంద్రబాబు మార్గ దశకంలో పనికి మాలిన రాజకీయాలు రఘురామకృష్ణంరాజు మానుకోవాలని హితవు పలికారు