YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ నెల 27 లోగా అన్ని హ్యాబిటేషలలో పనులన్ని పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ శరత్

ఈ నెల 27 లోగా అన్ని హ్యాబిటేషలలో పనులన్ని పూర్తి కావాలి జిల్లా కలెక్టర్ శరత్

కామారెడ్డి ఆగస్ట్ 21 
ఈ నెల 27 లోగా జిల్లా లోని అన్ని హ్యాబిటేషలో పల్లె ప్రకృతి వనాలు, కంపోస్ట్ షెడ్స్ పూర్తి  కావాలని జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్ మండల అధికారులను ఆదేశించారు.  శుక్రవారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఎపిఓలతో పల్లెపగతిలో భాగంగా పల్లె పకృతి వనాలు, కంపోస్ట్ షెడ్స్, నర్సరీలు, ఎవెన్యూ ప్లాంటేషన్, మంకీవుడ్ కోర్టులు, సిసి ఛార్జెస్ తదితర కార్యక)మాలను మండల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు కురుస్తున్నందున అన్ని హ్యాబిటేషన్లలో పల్లె పుకృతి వనాలకు సంబంధించి ఈనెల 27 లోగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. పల్లె ప్రకృతి వనాలలో వెయ్యి మొక్కలకు తక్కువ కాకుండా చిట్టడవిలా మొక్కలు నాటాలని సూచించారు. వెంటనే ఆన్లైన్ నమోదు  చేయాలని ఆదేశించారు. దాతలు ఫెన్సింగ్, కుర్చీలు, దిమ్మెలు అందిస్తే వారి పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. పనుల పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కంటోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా పరిషత్ సిఇఓ,
జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. ప్రతి ఎండిఓ, ఎంపిఓ, ఎపిఓ తమ పరిథిలో వచ్చే క్లస్టర్స్ లో అన్ని గ్రామ పంచాయితీలలో పనులను ఎప్పటికప్పుడు క్షేత) స్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కంపోస్ట్ షెడ్ సంపద కేంద్యంగా మారాలని, ఈ నెల 27 లోగా కంపోస్ట్ షెడ్స్ పూర్తి చేయాలని తెలిపారు. గ్రామ పంచాయితీ నర్సరీలలో మొక్కల నమోదు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. మండల అధికారులు గ్రామాల సందర్శనకు వెళ్లినప్పుడు గ్రామాలలో మొదటగా రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించాలని సూచించారు. 85 శాతం  సంరక్షణ ముఖ్యమని తెలిపారు. కన్వర్జెన్సీ కింద టీ గార్డులు, బుక్ క్లియరెన్స్ చేపట్టాలని తెలిపారు.
మిగిలిన మంకీ ఫుడ్ కోర్టుల పనులు వేగం పెంచాలని, తప్పనిసరిగా రకరకాల పండ్ల మొక్కలు ఉండేలా చూడాలని సూచించారు. గ్రామ పంచాయితీ సిసి ఛార్జెస్, బిల్లుల నిర్వహణ కమం తప్పకుండా నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలని, ప్రతి గ్రామ పంచాయితీకి ఫాగింగ్ మెషిన్ తప్పనిసరిగా వుండాలని,బాడి ఫీజర్లు కూడా పొందాలని తెలిపారు. ఈ నెల 31 లోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, జియో ట్యాగింగ్ చేపట్టాలని ఆదేశించారు. గ్రామ స్థాయి, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్ మెయిన్ టైన్ చేయాలని ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు వెంకటేశ్ ధోతే), జిల్లా పరిషత్ సిఇఓ చందర్ నాయక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చందమోహన్ రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి నరేశ్, అధికారులు పాల్గొన్నారు.

Related Posts