YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ ఆగస్ట్ 21 
రాష్ట్ర ప్రభుత్వ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం నిర్లక్ష్యం వల్లే సంభవించిందనిబీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్ కుమార్ ఆరోపించారు.ప్రమాదం జరిగి 12 గంటలయినా ఉదోగుల ఆచూకీ కనుక్కోలేకపోయారని విమర్శించారు.విద్యుదుత్పత్తి సందర్భంగా అన్ని విభాగాలు నాణ్యతతో పని చేస్తున్నాయా లేదా? అనే ప్రధాన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ సీజన్ పొందే విద్యుత్ లో తెలంగాణ నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.ప్రమాదానికి ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రే బాధ్యత వహించాలి.సంగమేశ్వర టెండర్లు, పోతిరెడ్డిపాడు ద్వారా జల దోపిడీని కేసీఆర్ సర్కారు అడ్డుకోలేకపోయిందన్నరు.శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ ఉత్పత్తిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేక ప్రమాదానికి కారణమైందనిఅన్నారు.కేసీఆర్ ఇప్పటికయినా ఫామ్ హౌస్ రాజకీయాలు మానుకుని, ప్రజల క్షేమం కోసం రాజకీయాలు చేయాలని సంజయ్డిమాండ్ చేసారు.అధికారులు సహాయ చర్యలు ముమ్మరం చేయాలి. ఇంకా కాలయాపన చేసయకుండా ఉద్యోగుల ప్రాణాలు కాపాడాలి.ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులు క్షేమంగా బయటకు రావాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
 

Related Posts