YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దసరా కానుకగా పేదలకు 4,358 డబుల్‌బెడ్‌రూమ్‌లు-తలసాని

దసరా కానుకగా పేదలకు 4,358 డబుల్‌బెడ్‌రూమ్‌లు-తలసాని

హైదరాబాద్‌ ఆగస్ట్ 21 
గ్రేటర్‌ పరిధిలో పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. దసరా కానుకగా 21 ప్రాంతాల్లో 4,358 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యాయని, వాటిని లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. నగరంలో 812 కోట్లతో 7,455 డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం  జరుగుతోందన్నారు. ఇందులో ప్రారంభానికి 1144 ఇండ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. దసరా నాటికి మరో 3200 ఇండ్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్‌నగరంలో చేపట్టి డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణ పురోగతిపై మంత్రి తలసాని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్‌అలీతో కలిసి సమీక్ష  నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తిగా ప్రభుత్వ నిధులతో పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లను నిర్మించి ఇస్తున్నఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈసమావేశంలో హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఆర్డివో శ్రీనివాస్‌, హౌసింగ్‌ సీఈ సురేష్‌, వాటర్‌బోర్డు డైరెక్టర్‌ కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. డిసెంబర్‌ నాటికి అన్నిఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు.
=

Related Posts