YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మైనర్ బాలికకు న్యాయం చేయడంలో విఫలమైన దిశా పోలీస్ స్టేషన్

మైనర్ బాలికకు న్యాయం చేయడంలో విఫలమైన  దిశా  పోలీస్ స్టేషన్

నెల్లూరు ఆగస్ట్ 21 
బాలికలకు , మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై తక్షణమే న్యాయం జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దిశాచట్టం నెల్లూరు జిల్లా కావలి మండలం లో నెలకొన్న మైనర్ బాలిక అర్చన విషయంలో తమ దిశను మార్చుకున్న నెల్లూరు జిల్లా దిశాపోలీస్ స్టేషన్ అధికారులు, బాధిత అర్చనకు న్యాయం చేయడంలో విఫలం అయినట్లు తెలుస్తుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా నాయకులు కూరపాటి విజయ్ రాజ్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కావలి మండల పరిధిలోని బిట్రగుంట పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్న, ఎస్సై భరత్ కుమార్ స్థానిక మైనర్ బాలిక అర్చన ను తనను పెళ్లి చేసుకుంటానని ,మాయమాటలు చెప్పి నమ్మించి, ఆమెను తనతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరకంగా అనుభవించి, అనంతరం మైనర్ బాలిక అర్చన ను పెళ్లి చేసుకోకపోవడమే  కాకుండా, నిన్ను నీ కుటుంబాన్ని చంపుతామని బెదిరించిన విషయం 2020 మే మాసంలో జరిగిందన్నారు. ఈ విషయమై తాను మోసపోయానని తెలిసి, తన తండ్రి ప్రసాద్ నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఆమె తనకు భారం కాకూడదని ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నట్లు తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో బాధితురాలు మైనర్ బాలిక అర్చన 2020 మే నెల 12న జిల్లా కేంద్రంలోని ,దిశా పోలీస్ స్టేషన్ లో తనకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేసుకోవడం జరిగింది అన్నారు. ఈ విషయమై కావలి  రేంజ్ పోలీసులు ఎస్సై భరత్ కుమార్ ను అధికారికంగా సస్పెండ్ చేశారు తప్ప, బాధితురాలు అర్చనకు న్యాయం జరగలేదని తమ ఆవేదనను వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన దిశాచట్టం, పోలీస్ వర్గాల వారికి చుట్టంగా మారిందని ఆరోపించారు. సస్పెండ్కు గురైన ఎస్ఐ భరత్ కుమార్ కావలి పట్టణంలోనూ, స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ దర్జాగా తిరుగుతూ, బాధిత మైనర్ బాలికను నీ అంతు చూస్తానని బెదిరిస్తున్నట్లు ఆరోపణలతో పోలీస్ అధికారులకు ఆమె తెలియజేసిన ప్పటికీ, ఎస్సై భరత్ కుమార్ పై చట్ట రీత్యా తగిన చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించి, మైనర్ బాలిక అర్చన పట్ల ఎస్సై భరత్ కుమార్ ప్రవర్తించిన తీరుకు , ఆయనను అరెస్ట్ చేయకపోవడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం  ఎస్ ఐ భరత్ కుమార్ నుఅరెస్ట్ చేయకపోతే , జిల్లా దళిత సంఘాల ఆధ్వర్యంలో బాధిత మైనర్ బాలిక అర్చన ఆమరణ దీక్ష నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బాధిత మైనర్ బాలిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts