చిత్తూరు ఆగస్టు 21
పాల ఫ్యాక్టరీ లో జరిగిన దుర్ఘటన ఇబ్బందికరమైన దని జిల్లా కలెక్టర్, ఎస్.పి సకాలంలో స్పందించడంతో పాటు ఇతర అధికారులను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని మొత్తం 14 మంది బాధితులు కోరుకుంటున్నారని వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పూతలపట్టు శాసనసభ్యులు ఎం ఎస్ బాబు అన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది బాధితులను చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఉన్నత వైద్యం కావాలంటే ఇతర ఆసుపత్రికి పంపి అందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. కాగా గురువారం రాత్రి ముగ్గురు పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో వారిని తిరుపతికి తరలించారు. అనంతరం ఏ ఎం ఎస్ బాబు పూతలపట్టు మండలం లో గల బండపల్లి వద్ద దుర్ఘటన జరిగిన పాల ఫ్యాక్టరీని పరిశీలించారు. యాజమాన్యం తరపున ఉన్న ప్రతినిధులను సంఘటన జరిగిన తీరు గురించి విచారించారు. సంఘటనలో గాయపడిన వారికి ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వడం జరుగుతుందని ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారం వ్యక్తం చేయడమే కాక వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు జిల్లా కలెక్టర్ ఇప్పటికే జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మరియు అగ్నిమాపక దళానికి చెందిన అధికారులను విచారణ కమిటీగా నియమించారని వారు ఇచ్చే నివేదిక పై తగు చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. దుర్ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు తో పాటు చిత్తూరు ఆర్డీవో రేణుక మాజీ జడ్పీ చైర్మన్ కుమార్ రాజా బంగారుపాలెం సింగిల్విండో చైర్మన్ దత్తాత్రేయ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు
=