ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి నిరసనగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. తన పుట్టినరోజు నాడు అంటే ఈనెల 20న చంద్రబాబు నిరాహార దీక్ష చేపడుతున్నారువిభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, తదితర అంశాల్లో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్ష చేపట్టనున్నారు. విజయవాడ నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిరసన దీక్ష చేపట్టాలని ఆదివారం నిర్ణయించారు. ఈ దీక్షకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 9 గంటలకు దీక్షలో కూర్చోవాలని ఆయన నిర్ణయించారు.దీక్ష అనంతరం సాయంత్రం దళితతేజం-తెలుగుదేశం బహిరంగ సభలో పాల్గొననున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నియోజకవర్గ కేంద్రాలు, మండల, జిల్లా కేంద్రాల్లో టీడీపీ నేతలు దీక్షలు చేయాలని చంద్రబాబు సూచించారు. సోమవారం జరిగే టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, దీక్షకు సంబంధించి గ్రామ, మండలస్థాయి నేతలతో చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 500 మంది టీడీపీ నేతలు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.