YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పట్టణ ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం

పట్టణ ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం

సంగారెడ్డి ఆగస్టు 21

పట్టణ ప్రజల కోసం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేశాం  మూడు మొబైల్ బయో టాయిలెట్ బస్సులను అందుబాటులో ఉంచాం  రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు  
జిల్లాలోని అన్ని పురపాలికల్లో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లను అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు.  పట్టణ ప్రగతిలో భాగంగా  సంగారెడ్డి ఎక్స్ రోడ్ లో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను శుక్రవారం  మంత్రి ప్రారంభించారు.  పిమ్మట కలెక్టరేట్ లో అమీన్ పూర్ , సదాశివ పేట, బొల్లారం పురపాలక సంఘాల కొరకు  ఏర్పాటయిన మూడు  మోబైల్ బయో టాయిలెట్ బస్సులను  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా సంగారెడ్డిలో పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనల మేరకు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక మరుగుదొడ్డి ఉండాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన 346 మరుగుదొడ్లు ఉండాల్సి ఉండగా, ఇప్పటివరకు 115 మాత్రమే ఉన్నాయని ,గత నెలన్నరగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్,తాను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణాల పై రెగ్యులర్ గా సమీక్షించడం జరిగిందన్నారు.
గత నెల రోజులుగా జిల్లాలో 231 మరుగుదొడ్లను నిర్మించారని, దీంతో జనాభాకు సరిపడు 346 మరుగుదొడ్లు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. అందులో 50 శాతం మహిళలకు 50 శాతం పురుషుల కోసం నిర్మించినట్లు తెలిపారు.
 రివ్యూ లో భాగంగా  మొబైల్ షి టాయిలెట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా  మహిళలు  గుళ్లకు ,సంతలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది లేకుండా మొబైల్ షి టాయిలెట్ బస్సులను ప్రతి పట్టణంలో సంత/అంగడి జరిగే చోట ఉంచాలని మంత్రి ఆయా మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.  
జిల్లాలో 6 మొబైల్ షి టాయిలెట్ బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ నుండి పాత బస్సులను తీసుకుని ప్రతి బస్సులో 2 టాయిలెట్లు ఉండేలా ఏర్పాటు చేశామని, అందులో ఒకటి  ఇండియన్ టాయిలెట్ , మరొకటి వెస్ట్రన్ టాయిలెట్ ఉందన్నారు. ఇవి ప్రత్యేకించి మహిళలు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు.మొబైల్ టాయిలెట్ ల ఏర్పాటులో ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి జిల్లా మొదటి జిల్లా అని మంత్రి తెలిపారు.
అన్ని మున్సిపాలిటీలలో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణ పబ్లిక్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. మరుగుదొడ్ల ముందుభాగంలో ఒక షాపు ఉంటుందని వెనుక భాగంలో మరుగుదొడ్లు ఉంటాయనీ, రన్నింగ్ వాటర్ తో అన్ని వేళల అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ప్రజల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన  మరుగుదొడ్లు వినియోగంలోకి వచ్చేలా చూడాలని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లకు సూచించారు. ప్రజలు పబ్లిక్ టాయిలెట్లను తమ అవసరం మేరకు వినియోగించు కోవడంతో పాటు  పట్టణాలను స్వచ్ఛ పట్టణాలుగా ఉంచడంలో భాగస్వాములు కావాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్ పర్సన్ లు, వైస్ చైర్మన్లు, మాజీ శాసనసభ్యులు చింత ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

Related Posts