కర్నూలు ఆగస్టు 21
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో అగసనూరు గ్రామంలో నేడు రైతులు ఆందోళన చేశారు వివరాల్లోకెళితే అగసనూరు గ్రామం దగ్గర ఉన్న ఆర్ డి ఎస్ అన్న కట్ట వద్ద ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ద్వారా ఆ కాలువ వచ్చే దారిలో మా పంట పొలాలు పోతాయని మేము వాటిపైన మా కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నామని కావున ఆర్డీఎస్ అనకట్ట దగ్గర వస్తున్న ఆర్డీఎస్ కుడి కాలువ ఆపివేయాలని కర్నూలు జిల్లా డిప్యూటీ కలెక్టర్ గారికి అగసనూరు గ్రామం లో రైతులందరూ కలసి డిప్యూటీ కలెక్టర్ గారికి లేఖ రాశారు, ఆ లేఖలో అగసనూరు గ్రామం నుండి ఆర్డీఎస్ కుడికాలువ వెళితే మాకి పొలాలు దక్కవు కావున మేము వాటిపైన జీవనాధారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాము అందుకు గాను ఆర్ డి ఎస్ కుడికాలు ప్రాజెక్ట్ ఆపి వేయాల్సిందిగా డిప్యూటీ కలెక్టర్ కు లేఖ రాయడం జరిగింది అని రైతులు తెలియజేశారు
రైతులను కాదని ఆర్డీఎస్ కుడి కాలు వస్తే రైతు కుటుంబాలు రోడ్డున పడటం కాకుండా రైతులకు ఇల్లు కూడా లేకుండా పోతుంది ఎందుకంటే అగసనూరు గ్రామానికి దక్షిణం దిక్కున తుంగభద్ర నది ఉత్తరం దిక్కున ఆర్ డి ఎస్ కుడికాలు వస్తే వర్షాకాలంలో వరదలు వచ్చి అగసనూరు గ్రామాన్ని చుట్టుముట్టి వరదతో ముప్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కుడికాలు ఆపి వేయాల్సిందిగా కోరుతున్నాము అగసనూరు గ్రామ ప్రజలు మరియు అగసనూరు జన చైతన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు