చెన్నై, ఆగస్టు 21
ముఖ గాయకుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి తమిళనాడు లోని ఎంజిఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. నిన్నటి వరకూ వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్న ఆయనకు తాజాగా ఎక్మో సపోర్ట్ ను కూడా అమర్చినట్లు హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ అనురాధా భాస్కరన్ తెలిపారు. ఆయనకు చికిత్స అందించే విషయమై విదేశీ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఆయనకు గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉండడంతో.. ఎక్మో మద్దతును అందించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఆసుపత్రి కి చేరిన మొదట్లో.. సాధారణం గా చికిత్సను అందించారు. ఆ తరువాత ఆయనను ఐసియు కు మార్చారు. ఆ తరువాత ఈసీఎంఓ సపోర్టుతో చికిత్సను చేసారు.. నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెరుగు పడుతోందని, చికిత్సకు స్పందిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే.. రాను రాను కరోనా ఆయన శరీరం లో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది.. శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుండడంతో ఆయనకు వెంటిలేటర్ ను అమర్చారు. ప్రస్తుతం అది కూడా సరిపోవడం లేదు.. ఈ నేపధ్యంలో ఎక్మో వ్యవస్థతో చికిత్స అందించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయన స్పృహ లో లేరు.. ఆయనకి చికిత్స జరుగుతోంది అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనితో అభిమానుల్లో ఆందోళన స్థాయి పెరిగింది. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ఇంటికి రావాలని పలువురు ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు