YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బంద్ సంపూర్ణం

బంద్ సంపూర్ణం

ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు విభజన చట్టంలోని హామీలు అమలు చెయ్యాలని విపక్షాలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగాకొనసాగింది. అన్ని జిల్లల్లలోనూ విపక్షాలు కదం తొక్కి బంద్ ను విజయవంతం చేసాయి. పలు జిల్లాల్లో తెల్లవారుజామునే బస్సు డిపోలముందు అందోళనకు దిగి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నాయి.  నెల్లూరుజిల్లాలొ  తెల్లవారుజాము నుంచే  వైసీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, జనసేన, కార్యకర్తలు, పార్టీనేతలు ఆందోళనకు దిగారు.. 

నెల్లూరు డిపోవద్ద బస్సులు బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు.. చెన్నయ్ ,కొలకత్తా ,నకిరేకల్ - దోర్నాల ,నెల్లూరు -ముంబయి జాతీయ రహదారులను బంద్ నిర్వాహకులు దిగ్భంధం చేశారు. నెల్లూరు ఆర్టీసిడిపోవద్ద ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. కావలి, వెంకటగిరి, ఆత్మకూరు, గూడూరులో తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు రోడ్డుమీద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు.  విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా మూసేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ఉదయం నుంచి విపక్ష పార్టీలు రోడ్డుపైకి వచ్చాయి. ముందు నుంచే బంద్ గురించి సమాచారం ఉండటంతో ప్రజలు సైతం స్వచ్చందంగా బంద్ ను పాటించారు. . ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంతేకాకుండా వర్తక,  వ్యాపార సంస్థలు  కూడా బంద్ కు మద్దతుగా  ప్రకటించాయి. 

శ్రీకాకుళం జిల్లాలో బంద్ ప్రభావం కనిపించింది. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఉదయం 4గంటల నుంచి డిపోల వద్ద నుంచి బస్సులను బైటకు రాకుండా అడ్డుకున్నారు. స్వచ్చందంగా షాపులు, హుటల్స్ పాఠశాలలు,కాలేజ్లు మూసివేసారు. జిల్లా కేంద్రంలో బస్సులను వామపక్షనేతలు అడ్డుకోవటంతో కొంత మంది వామపక్ష నేతలను పోలీస్లు అదుపులోకు తీసుకున్నారు . పాతపట్నంలో  బస్సులును నడుపుచుండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, వామపక్షనేతలు బస్సులును అడ్డుకున్నారు.ఇచ్చాపురంలలో స్కూల్ పిల్లలను స్కూల్కు తీసుకువస్తున్న వాహనాలకు ఆపి తిరిగి పంపించివేసారు. 

పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగింది. ఏలూరు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, భీమవరం తణుకు, నరసాపురం లలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. తెల్లవారుజాము నుండి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వామపక్షాలు, వైసిపి, జనసేన, ప్రజాసంఘాల నేతలు ధర్నా నిర్వహించాయి. ఏలూరు కొత్తూరు జ్యూట్ మిల్ కార్మికులను డ్యూటీ వెళ్లకుండా అడ్డుకున్న ఆందోళన కారులు, మేము డ్యూటీ కి వెళతాం అంటూ కార్మికులు నిలదీయడం తో ఆందోళన కారులకు, కార్మికుల కు మధ్య వాగ్వివాదం జరిగింది. ప్రత్యేక హోదా కోసం  

ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో తలపెట్టిన బంద్ కి కృష్ణా జిల్లాలో విజయవంతమయింది. ఉదయం,5 గంటలనుంచి  ఆర్టీసీ బస్ స్టాండు దగ్గర ,వామపక్షాలు, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,జనసేన ఇతర ప్రజా సంఘాలు దర్నా కు దిగారు. బస్ స్టాండు నుండి ఒక్కబస్ కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు. మచిలీపట్నం పరిసరాలలో భారీగా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడ అందోళనకారులను నిలువరించారు. బంద్ లో అసాంఘిక శక్తులు చోరబడే అవకాశం ఉందని పోలీసులు ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లాలో కుడా బంద్ ప్రభావం కనపడింది. కర్నూలు బస్టాండ్ వద్ద వైసిపి, వామపక్ష నేతలు బైఠాయించారు. జిల్లా వ్యాప్తంగా డిపోలలోనే  ఆర్టీసీ బస్ లు వుండిపోయాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఉద్యమకారులు పలు దుకాణాలను మూయించివేసారు. పత్తి కొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్ బనగానపల్లె, ఆలూరు, ఎమ్మిగనూరు ఆదోని ఆర్టీసీ డిపోల వద్ద వైసిపి నాయకులు ఆందోళన చేసారు. . శ్రీకాకుళంలో కుడా బంద్ సంపూర్ణంగా కొనసాగింది.  జిల్లాలో పలు చోట్ల రోడ్డు పైకి చేరుకున్న వైసీపీ సిపీఏం సీపీఐ పార్టీల నేతలు నినాదాలు చేసుకుంటూ తిరిగారు. జిల్లాలో ప్రధాన జంక్షన్ లో ఆర్టీసీ బస్సులను అడ్డుకుని జాతీయ రహదారిని దిగ్బందం చేసారు. 

Related Posts