YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

భగవద్గీత

భగవద్గీత

భగవద్గీతను శ్రీకృష్ణుడు తృప్తిగా భోజనం చేసిన తరువాత తాంబూలం సేవిస్తూ "అర్జునా! కులాసాగా మనం భగవద్గీత చెప్పుకుందామా!!", అని చెప్పలేదు........లేక సాయంత్రం విహారానికి వెళ్ళినప్పుడు, తీరిక సమయంలో చెప్పలేదు. ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజుకు చెప్పలేదు, పితామహుడు భీష్మునికి చెప్పలేదు, నీతి కోవిదులకు కూడా చెప్పలేదు ఆయన కేవలం అర్జునుడికి మాత్రమే చెప్పాడు. అది కూడా యుద్ధం ఇంకాసేపట్లో జరగబోతుంది అనగా చెప్పాడు అర్జునుడి మనసు సంఘర్షణలతో క్షుబితం అయినప్పుడు చెప్పాడు.
అర్జునుడు తాను యుద్ధం చేయను అనే నిర్వేదం ఆవహించినప్పుడు చెప్పాడు. "నాకు ఏమీ తోచడం లేదు ఏ నిర్ణయం తీసుకునే శక్తి నాకు లేదు నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు కర్తవ్యం ఉపదేశించు కృష్ణ!!" అని అర్జునుడు పూర్తిగా శరణాగతి అయిన తరువాత చెప్పాడు.
నానుశోచంతి అనే పదం తో మొదలుపెట్టి మాశుచః అనే పదంతో పూర్తి చేస్తాడు అంటే ఏడవద్దు అని అర్జునుడు కన్నీళ్లు తూడ్చాడు.
మనలో కూడా అనునిత్యం మంచి చెడుల మధ్య జరిగే సంఘర్షణ భారతయుద్ధం. మంచి అయితే పాండవులు, చెడు అయితే కౌరవులు.
మనలో సంఘర్షణ తలెత్తినప్పుడు నివారణోపాయం చూపేది భగవద్గీత.
కేవలము భగవంతుని మీద భక్తి ఉంటే చాలదు సాటి మానవుల మీద సాటి ప్రాణుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండాలని బోధిస్తోంది గీత. అన్ని ప్రాణులలో పరమాత్మ ఆత్మ స్వరూపుడు గా ఉన్నాడు సాటి మానవులను దూషిస్తే సాటి, ప్రాణాల్ని హింసిస్తే అది పరమాత్మ హింసించినట్టు అవుతుంది అని నొక్కి చెప్పింది గీత.
ప్రతి వారిలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించే భగవద్గీత.
కానీ నేడు జరుగుతున్నది ఏమిటి భగవద్గీతను ఘంటసాల గానామృతం చేస్తే దానిని శవాల దగ్గర  స్మశానాలలో పెడుతున్నారు భగవద్గీత వినపడితే చాలు ఎవరో పోయినట్టు భావన కలిగిస్తున్నారు  ఈ దౌర్భాగ్య స్థితి నుండి మనం బయట పడాలి
కృష్ణం వందే జగద్గురుం

Related Posts