YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఒక బీజేపీ... మూడు శాఖలు

ఒక బీజేపీ... మూడు శాఖలు

విజయవాడ, ఆగస్టు 24  
బీజేపీ మొనగాడు పార్టీలాగానే ఉంది. లేకపోతే ఏపీలో .84 శాతం ఓట్లు వచ్చిన పార్టీ చుట్టూ ఇంత చర్చ ఎందుకు వస్తుంది. ఓ వైపు 50 శాతం పైగా ఓట్లు తెచ్చుకుని 151 సీట్లతో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. ఇంకో వైపు 23 సీట్లు వచ్చినా కూడా 38 శాతం ఓట్లతో టీడీపీ కూడా పటిష్టంగానే ఉంది. ఇక సినీ గ్లామర్ తో పాటు బలమైన సామాజిక వర్గం మద్దతు జనసేనకు ఉంది. పైగా ఒంటరిగా బరిలో దిగితే 7 శాతం ఓట్లు వచ్చాయి. అంటే గట్టిగా కష్టపడితే భవిష్యత్తు ఉందని పవన్ కి జనం చెప్పినట్లే. అయినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.అయితే పవన్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అంటూ ఓ వైపు పుకార్లు వస్తున్నాయి. అందుకే పవన్ ఇప్పటికీ ఎక్కడా పార్టీ కమిటీలను వేయలేదని, పైగా సినిమాలు అలా చేస్తుకుంటూ వెళ్తున్నారని కూడా అంటున్నారు. మరో వైపు 2024లో కూటమి అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అని సోము వీర్రాజు ఇప్పటికే చెప్పారు అంతే తప్ప పవన్ సీఎం అనడంలేదు, ఇక బీజేపీ జనసేనను మొదటి నుంచి అడిగింది విలీనమే. ఆ విషయాన్ని పవనే స్వయంగా అనేక సభల్లో, మీడియా మీటింగుల్లో చెప్పుకున్నారు కూడా. అమిత్ షా తన పార్టీని విలీనం చేయమన్నారని, కానీ తన కంఠంలో ప్రాణం ఉండగా ఆ పని చేయనని పవన్ అన్నారు కూడా. కానీ చూస్తూంటే విలీనం దిశగానే ఈ కధ సాగుతోంది అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కూటములు వాటి మధ్య సీట్ల పంపిణీ వంటి తలనొప్పులు ఎందుకు ఒకే పార్టీగా బీజేపీ 2024 ఎన్నికలకు వెళ్లాలన్నది బీజేపీ హై కమాండ్ ఆలోచనట. అది ఇవాళ కాకపోయినా రేపు అయినా జరుగుతుంది అంటున్నారు.సరే జనసేన ఎటూ పొత్తుతో బీజేపీకి చాలా దగ్గరగానే ఉంది.కానీ టీడీపీ అలా కాదుగా, బలమైన విపక్షంగా ఏపీలో ఉంది. మరి బీజేపీలో ఆ పార్టీ ఎలా విలీనం అవుతుంది, అంటే చంద్రబాబే దగ్గరుడి మరీ ఆ పని చేయిస్తారు అని అంటున్నారు. బాబు ఇప్పటికేతన పార్టీని కొంత విలీనం చేశారని కూడా చెబుతున్నారు. అదెలా అంటే తన మనుషులు అయిన సుజనా చౌదరి, సీఎం రమేష్ సహా నలుగురు ఎంపీలను బీజేపీలోకి పంపిన‌ నాడే ఈ ప్రక్రియకు నాంది పలికారని అంటున్నారు. ఇక పొత్తులు అంటే మాకు కుదరవు, ఆ మాట మాకు ఇష్టం లేదని జాతీయ అధికార ప్రతినిధి జీవీఈల్ నరసింహారావు ఇప్పటికే చెప్పేశారు. చంద్రబాబుకు అంత సరదాగా ఉంటే తన టీడీపీని బీజేపీలో విలీనం చేయమనండి అని ఆయన మీడియా సాక్షిగా ఎన్నో సార్లు చెప్పారు కూడా. అంటే బాబు తో సహా అంతా పాహిమాం అని బీజేపీలో చేరే రోజు రావాలని, ఒకవేళ అలా రాకపోతే సామదాన భేధ దండోపాయాలతో తామే రప్పిస్తామని కమలనాధులు గట్టిగానే ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారుట.ఈ మాట ఎల్లో మీడియా నుంచి వస్తోంది. ఏపీలో బీజేపీ వైసీపీని నమిలి మింగేస్తుందిట. ఎందుకంటే జగన్ మీద కేసులు ఉన్నాయట. అందువల్ల ఆయన జైలు పాలై ఆ పార్టీకి నాయకత్వ లోపం తలెత్తితే మొత్తానికి మొత్తం వైసీపీని బీజేపీగా మార్చేస్తుందిట. ఇలా జరగాలని పసుపు పార్టీకి, దాని శ్రేయోభిలాషిగా ఉన్న మీడియాకు ఒక తీరని కోరిక. కానీ ఇందులో సాధ్యసాధ్యాలు తీసుకుంటే మొదటిది సులువుగా అయ్యేట్లుంది. అంటే జనసేన బీజేపీతో విలీనం, రెండవది అపుడే ఆపరేషన్ స్టార్ట్ అయింది. టీడీపీలో చంద్రబాబు, కొడుకు తప్ప అందరికీ లాక్కునే సీన్ కి స్క్రిప్ట్ రెడీ అవుతోంది. జగన్..ఆయన జైలు అన్నది చూసేసిన సినిమా. పైగా ఇపుడున్న స్థితిలో వైసీపీని టచ్ చేయడం కూడా కష్టమే. మొత్తానికి ఒక్క బీజేపీ చుట్టూ మూడు విలీనాల కధ మాత్రం అలా తిరుగుతోంది. ఈ రాజకీయంలో ట్విస్టులు మాత్రం చాలానే ఉంటాయి.

Related Posts