YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

కరోనా కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

తిరుపతి ఆగస్టు 24  
తిరుచానూరు శ్రీ పద్మావతి నిలయానికి ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి సోమవారం ఉదయం ఆరు  గంటలకే చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.  కరోనా బాధితులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.  అనంతరం కరోనా బాధితులకు సర్వీస్ చేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. వారితో కలిసి చెవిరెడ్డి టిఫిన్ చేసారు. ఈ సందర్భంగా వారు చేస్తున్న సేవల పట్ల కార్మికులను చెవిరెడ్డి అభినందించారు.    కింది స్థాయి సిబ్బంది సేవలను గుర్తించి చెవిరెడ్డి వంటి ప్రజాప్రతినిధి తమతో కలిసి టిఫిన్ చేయడం, మమ్ములను అభినందించడం వంటివి మాకు ఎంతగానో ప్రోత్సహాన్ని కల్పించాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.   పద్మావతి నిలయంలో కరోనా బాధితులతో మాట్లాడారు. అందుతున్న సేవల పట్ల అరా తీశారు.   కరోనా బాధితులకు ఏ ఒక్క చిన్నపాటి ఆసౌకర్యం కలగరాదని అధికారులకు సూచించారు. ఏదేని ఫిర్యాదు అందిన యెడల చర్యలు తప్పవని హెచ్చరించారు.  అంతకుముందు వంటశాల ను, మందులు పంపిణీ కేంద్రం, కరోనా టెస్ట్ లు నిర్వహించే ల్యాబ్ ను చెవిరెడ్డి పరిశీలించారు.  కరోనా బాధితులకు ఆహారం వేడిగా అందాలని కాంట్రాక్టర్ కు సూచించారు. ఇలా ఆహారం అందించాలంటే నిర్దిష్టమైన సంఖ్యలో సిబ్బంది ఉండేలా చూసుకోవాలని సూచించారు.

Related Posts