కాకినాడ ఆగస్టు 24
పెద్దాపురం శివారు ఏలేరు కాలువలో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన స్థానిక యువకులు తాళ్ళ సహాయంతో వివాహితను కాపాడారు. ఘటన సమయంలో ఆమెతోపాటు మూడేళ్ళ కుమార్తె వుంది. కుమార్తెను వంతెన పై వదిలి కాలువలోకి బాధితురాలు దూకేసింది. పోలీసులుకుడా ఘటనాస్థలానికి వచ్చారు. భార్యాభర్తల మధ్య గొడవే ఆత్మహత్యాయత్ననికి కారణమని పోలీసులు నిర్దారించారు. తరువాత భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు.