YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంచినీరు ఇవ్వండి

మంచినీరు ఇవ్వండి

విజయనగరం ఆగస్టు 24  
ప్రభుత్వాలు మారినా గిరిజనులు తలరాతలు మాత్రం మారడం లేదు.  దీనికి ఉదాహరణ మక్కువ మండలం కవిరిపల్లి పంచాయితీ కవిరివాలస  గ్రామం ఇక్కడ సుమారు 100 వరకు గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. మండల కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామమైన కవిరివలస గ్రామం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి సొంత ఊరైన కవిరి పల్లి పంచాయతీ లో ఉన్నది. ఎంతమంది పాలకులు మారిన ఈ గ్రామంలో సమస్యల మాత్రం నెరవేరడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ముఖ్యంగా తాగడానికి మంచినీరు లేక పక్కనే ఉన్న వాగులో నుంచి మురికి నీటిని తీసుకొచ్చి తాగుతున్నామని దీనివలన చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారని. అంతేకాకుండా ఈ వాగులో నుంచి నీరు తేవడానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి పంట పొలాల మధ్యలో నుంచి బురద మయమైన దారిలో నీటిని మోసుకుంటూ వస్తున్నామని వర్షాకాలం వచ్చిందంటే గ్రామంలో ఉన్న ముసలివాళ్ళు గర్భిణీ స్త్రీలు అందరూ ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్లి నీటిని తీసుకువస్తున్నారని. నీటిని తీసుకు వస్తున్న సమయంలో చాలామంది పొలం గట్ల మీద కాలుజారి పడిపోవడంతో ముసలివాళ్ళు గర్భిణి స్త్రీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మంచినీటి సౌకర్యం,  రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు

Related Posts