YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

భోధనేతర కార్యక్రమాల్లో టీచర్లు

భోధనేతర కార్యక్రమాల్లో టీచర్లు

రంగారెడ్డి, ఆగస్టు 24, 
రోజు రోజుకూ టీచర్లపై ఇతర పనుల భారం పెరిగిపోతోంది. సింగిల్‌‌‌‌ టీచర్‌‌‌‌, ఇద్దరు టీచర్లు ఉన్న బడుల్లో ఇది తీవ్రంగా ఉంది. దీంతో స్టూడెంట్స్కు తాము న్యాయం చేయలేకపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండుమూడేండ్ల  నుంచి బోధనేతర పనులు ఎక్కువయ్యాయని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 26,040  సర్కారు స్కూళ్లుండగా, వీటిలో 26.87 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఆయా బడుల్లో 1,07,259 మంది టీచర్లు పనిచేస్తుండగా, మరో 15 వేలమంది వరకూ విద్యావాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో ప్రైమరీ స్కూళ్లు 18,217, అప్పర్‌‌‌‌ ప్రైమరీ స్కూళ్లు 3,186, హైస్కూళ్లు 4,687 ఉన్నాయి. పది మంది లోపు స్టూడెంట్స్‌‌‌‌ ఉన్న బడులను అనధికారికంగా మూసివేస్తుండగా, 20 మంది లోపు స్టూడెంట్స్ ఉన్న బడులకు ఒక టీచర్‌‌‌‌ను మాత్రమే కొనసాగిస్తున్నారు. కొన్నిస్కూళ్లలో ఐదు తరగతులుండి, పేరెంట్స్‌‌‌‌ నుంచి ఒత్తిడి వస్తే అక్కడ మరో టీచర్‌‌‌‌ను కేటాయిస్తున్నారు. 2017–-18 యూడైస్‌‌‌‌ లెక్కల ప్రకారం11 నుంచి 20 మంది లోపు స్టూడెంట్స్ఉన్న స్కూళ్లు 3,252 ఉన్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ నుంచి భారీగా పనులు అప్పగిస్తుండటంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లకు ఇతర పనులు అప్పగించొద్దనే నిబంధన ఉన్నా.. ఉన్నతాధికారులు అవేవీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.టీచర్లకు రికార్డు వర్క్‌‌‌‌తో పాటు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పనులు కూడా పెరిగిపోయాయి. ప్రతిదీ ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో నమోదు చేయించాల్సి ఉంటోంది. బడుల్లో కంప్యూటర్లు ఉన్నా, వాటిని నిర్వహించేందుకు ఆపరేటర్లు లేరు. దీంతో గత్యంతరం లేక కొన్ని బడుల్లో టీచర్లు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ పనులు చేస్తుండగా, మరికొన్ని చోట్ల నెట్‌‌‌‌సెంటర్లలో చేయించాల్సి వస్తోంది. దీంతో సమయం అక్కడే వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఎస్‌‌‌‌సీఈఆర్‌‌‌‌టీ ఇచ్చిన షెడ్యూల్‌‌‌‌ మేరకు పాఠ్యాంశాలను బోధించాల్సి ఉందని, కానీ ఇతర పనులు చేయాల్సి వస్తోందని వాళ్లు వాపోతున్నారు. తాజాగా యాప్స్‌‌‌‌లోనూ వివిధ అంశాలను అప్‌లోడ్‌‌‌‌ చేయాల్సి వస్తోంది.
ఇతర పనుల వల్ల సింగిల్‌‌‌‌ టీచర్ స్కూళ్లకు తీవ్ర సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. రోజూ 36  రికార్డులు రాయడం, ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పంపించడం, మీటింగ్‌‌‌‌లకు హాజరుకావడం కష్టమవుతోంది. ఒకే టీచర్‌‌‌‌ ఐదు తరగతులకు బోధించడమే చాలా కష్టం. బోధనేతర పనులు కూడా చేయడం మరింత ఇబ్బందిగా మారింది. మీటింగ్‌‌‌‌లకు పోయిన రోజు, సీఆర్‌‌‌‌పీలు అందుబాటులో లేకుంటే బడి మూసేయాల్సిన పరిస్థితి. హెడ్మాస్టర్లు పాఠాలు చెప్పాల్సి ఉన్నా.. ఈ పనులతో బోధనకు దూరమవుతున్నారు.ప్రతి స్కూల్లో టీచర్లు పాఠాలు బోధించడంతోపాటు రికార్డు వర్క్‌‌‌‌ కూడా చేయాల్సి ఉంటోంది. ప్రతి స్కూల్ ఏటా 36 రికార్డులు మెయింటెనెన్స్‌‌‌‌ చేయాల్సి ఉంది. వీటిని టీచర్లందరూ కలిసి పూర్తి చేయాలి. రికార్డు వర్క్స్‌‌‌‌ మెయింటెనెన్స్‌‌‌‌ చేసేందుకు ప్రతి స్కూల్‌‌‌‌లో రికార్డు అసిస్టెంట్స్‌‌‌‌ లేదా జూనియర్‌‌‌‌ అసిస్టెంట్స్‌‌‌‌ ఉండాలి. గతేడాది లెక్కల ప్రకారం 26,040 స్కూళ్లకు గానూ 2,242 మంది మాత్రమే జూనియర్‌‌‌‌ అసిస్టెంట్స్‌‌‌‌ ఉండగా, 173 మంది మాత్రమే సీనియర్‌‌‌‌ అసిస్టెంట్స్‌‌‌‌ ఉన్నారు. అడ్మిషన్స్‌‌‌‌ రిజిస్టర్స్‌‌‌‌, మధ్యాహ్న భోజనం స్టాక్‌‌‌‌ అండ్‌‌‌‌ ఇష్యూ రిజిస్టర్స్‌‌‌‌, రైస్‌‌‌‌ స్టాక్ రిజిస్టర్‌‌‌‌, క్వాలిటీ కంట్రోల్‌‌‌‌ రిజిస్టర్స్‌‌‌‌, ఎగ్జామ్స్‌‌‌‌ మార్కులు, స్టూడెంట్స్‌‌‌‌ అటెండెన్స్‌‌‌‌, స్కూల్‌‌‌‌ డ్రెస్‌‌‌‌, టెక్ట్స్‌‌‌‌బుక్స్‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌, క్యాష్‌‌‌‌ బుక్‌‌‌‌, ఏజీఆర్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌, విజిటర్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎంసీ మీటింగ్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌,  లైబ్రరీ బుక్స్‌‌‌‌ రిజిస్టర్‌‌‌‌, టెక్ట్స్‌‌‌‌ బుక్స్‌‌‌‌… ఇలా వివిధ అంశాలకు చెందిన 36 రికార్డులను టీచర్లు నిర్వహించాల్సి వస్తోంది. వీటికి తోడు స్కూల్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌మీటింగ్‌‌‌‌లు, మిడ్‌ డే మీల్స్‌‌‌‌తోపాటు నెలలో రెండు, మూడు రోజులు ఏదో అంశంపై మీటింగ్‌‌‌‌లు పెడుతూనే ఉంటారు. వివిధ అంశాలపై శిక్షణ తరగతులు కూడా ఉంటాయి.

Related Posts