హైదరాబాద్, ఆగస్టు 24
ఆల్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మైనారిటీల కమిటీ విద్యావంతులైన నిరుద్యోగ యువత మరియు మహిళల కోసం ఉచిత ఆన్‌లైన్ జాబ్ మేళాకు విశేష స్పందల లబించినట్లు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్. జెడ్ సయీద్ ప్రకటించారు. జాబ్ మేళాకు ముందు మూడు రోజుల కౌన్సెలింగ్ సెషన్ కూడా జరిగిందని, ఇందులో అభ్యర్థులకు ఇంటర్వ్యూ పద్ధతులు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన ఇతర అవసరమైన సమాచారం గురించి మార్గదర్శకత్వం అందించామని చెప్పారు.సెట్‌విన్, జిఎంఆర్, కండెంట్, ఆర్‌అండ్‌డి, ఫ్రాంకోఫైల్ ఫ్రెంచ్, సునైనా మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీల సహకారంతో కమిటీ యొక్క 'ఖుద్ కమావో-ఖుద్ ఖావో' కార్యక్రమం కింద ఈ జాబ్ మేళాను నిర్వహించారు. రుబ్నియా మైధాని జాబ్ మేళా మరియు కౌన్సెలింగ్ సెషన్కు బాధ్యత వహించారు. ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, అనుబంధ కోర్సుల కోసం శిక్షణా కార్యక్రమాన్ని కమిటీ అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను వాట్సాప్ నెంబర్ 98499 32346 లో నమోదు చేసుకోవాలనిసయీద్ కోరారు.