YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీతో కుమ్మకైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా!..ఆజాద్‌

 బీజేపీతో కుమ్మకైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా!..ఆజాద్‌

న్యూఢిల్లీ ఆగస్టు 24, 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం వాడీవేడీగా జరుగుతోంది.రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై సీనియర్‌ నేత గులామ్ నబీ ఆజాద్‌తో పాటు పలువురు నాయకులు స్పందించినట్లుకా తెలిసింది. బీజేపీతో కుమ్మకైనట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆజాద్‌ అన్నట్లుగా తెలుస్తోంది. వర్చువల్‌ విధానంలో సమావేశం జరుగుతుండగా సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌, సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, ఆజాద్‌, చిదంబరం, వీరప్ప మొయిలీతో పాటు సీనియర్‌ పాటు 48 మంది సభ్యులు పాల్గొన్నారు. టెన్‌ జన్‌పథ్‌ నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదట వేణుగోపాల్‌ సోనియా గాంధీ రాసిన లేఖను సభ్యులకు చదివి వినిపించారు.ఈ సందర్భంగా సోనియా తనకు అధ్యక్ష పదవి ఆసక్తి లేదని, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే.. కేసీ వేణుగోపాల్‌ ఇటీవల పార్టీ నేతలు సోనియాకు రాసిన లేఖ బహిర్గతం కావడంపై ప్రశ్నించారు. లేఖ బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు రాసిన లేఖపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలపై రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభం కాగానే మొదట రాహుల్‌ గాంధీ మాట్లాడారు. సమావేశ సందర్భంగా 23 మంది సీనియర్లు లేఖరాయడంపై రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సోనియా ఆరోగ్యం సరిగా లేని సమయంలో లేఖ రాసేందుకు ఇదే సమయం ఇదేనా అని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఎలా బయటకు వెళ్తున్నాయని ప్రశ్నించారు. పార్టీ విషయాలను అంతర్గత వ్యవహారాలను సోషల్ మీడియాలో, బహిరంగంగా ఎందుకు చర్చిస్తున్నారని ప్రశ్నించినట్లుగా తెలిసింది. సంక్షోభ సమయంలో పార్టీ నాయకత్వ బాధ్యతలపై చర్చ అవసరమా? అన్నట్లు తెలుస్తోంది. నాయకత్వం మార్పు సమయం చూసుకోకుండా లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీతో కుమ్మక్కై లేఖ రాసినట్లుగా భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. లేఖ రాయడంపై ఉన్న ఉద్దేశాలను ప్రశ్నించారు. తాను రాజీనామా చేశాక సోనియా గాంధీ విముఖ తెలిపారని, కాంగ్రెస్‌  సీనియర్‌ నేతల ఒత్తిడితోనే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినట్లు ప్రస్తావించినట్లు సమాచారం.

Related Posts