హైదరాబాద్ ఆగస్టు 24,
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు, అశేష సినీ లోకం కోరుకుంది. అందరి ప్రార్ధనలు ఫలించి బాలసుబ్రహ్మణ్యం కు ఈ రోజు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్‌గా వచ్చింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.గత కొన్ని రోజులుగా ఎక్మో మరియు వెంటిలేటర్ పరికరాల సహాయంతో చికిత్స పొందుతున్న బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, క్రమేపి కోలుకొంటున్నారని పేర్కొన్నారు ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు. ఈ నెల 5న కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన బాలు 14 వ తేదీ వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత క్షీణించడంతో 19 నుండి ఎక్మో చికిత్స మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తుంది.