YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపా నాయకుల బెదిరింపులకు టిడిపి బెదిరే ప్రసక్తే లేదు టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మాలే పాటి

వైకాపా నాయకుల బెదిరింపులకు టిడిపి బెదిరే ప్రసక్తే లేదు  టిడిపి జిల్లా అధికార ప్రతినిధి  మాలే పాటి

నెల్లూరు ఆగస్టు 24, 
వైకాపా నాయకుల బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరే ప్రసక్తేలేదని నెల్లూరు జిల్లా టిడిపి అధికార ప్రతినిధి పెన్నా డెల్టా మాజీ వైస్ చైర్మన్ మాలే పాటి సుబ్బానాయుడు వైకాపా నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. తన నివాసంలో నెల్లూరు నగరం ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి,  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ళపాక అనురాధ,ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పిట్టు సత్యనారాయణ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా సుబ్బానాయుడు మాట్లాడుతూ దామవరం ఎయిర్ పోర్ట్ భూముల అవినీతి ఆరోపణల పై విచారణకు నేను సిద్దం అని సవాల్ విసిరారు.  వైసిపి నాయకులు ఎయిర్ పోర్ట్ భూముల పై చేస్తున్న అరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్దమని ఎప్పటినుంచో చెప్తున్నా , దానిని పట్టించుకోకుండా గత రెండేళ్ళ  నుంచి అవే ఆరోపణలు చెస్తున్నారు.  నేను గత తెదేపా ప్రభుత్వంలోనే ఈ ఆరోపణలపై విచారణకు సిద్దమని సవాల్ చేశా నని గుర్తు చేశారు.అప్పుడు పట్టించుకోకుండా గత కొద్ది రోజులగా అవే ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మీరు చేస్తున్న ఆరోపణల విచారణను ఆ గ్రామం వద్దే తెల్చుకుందాం, మీ నాయకులు ఎవరు వస్తారో రండి నేను మా పార్టీ నుండి ఒక్కడినే వస్తాను, మీ ముందే ఆ భూములు ఎవరివో తెలుసుకుందాం అంటూ ఆవేదనకు గురయ్యారు.  వైకాపా నాయకులు చేసిన ఆరోపణలపై నేను ఆ ఊరిలోనే రచ్చ బండకు ఆహ్వానిస్తే, మీరు నా ఇంటిపైకి అర్థరాత్రి ఒంటిగంటకి పొలీసులను పంపి హౌస్ అరెస్ట్ లు చేస్తారా అంటూ ఆవేదన చెందారు.టీడీపీ నాయకులు ఎవరూ పొలీసులకు బయపడేవాళ్ళం కాదని తెలియజేశారు. వైసిపి నాయకులు పొలీసులను, వైసిపి కార్యకర్తలలాగ వాడుకొంటున్నారు అని ఆరోపించారు.  చంద్రబాబు  నాయకత్వంలో మేము, మా పార్టీ సిద్దాంతాలను పాటిస్తాము, నేను ఇప్పటికి దగదర్తి ఎయిర్పోర్ట్ భూములు దగ్గరకు రావడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, గ్రామీణ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, రాష్ట్ర అధికార ప్రతినిధి తాళ్ళపాక అనురాధ, మాజీ కార్పొరేటర్లు బుచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పిట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Posts